ఫ్యాక్ట్ చెక్: బార్బర్ జిహాద్ అంశంలో పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారంటూ వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదారి పట్టించేవి
కొందరు వ్యక్తులు బార్బర్ జిహాద్ కు పాల్పడుతూ ఉన్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఈ కథనం జూలై 2013 నాటిది. ఇటీవలిది కాదని స్పష్టంగా తెలుస్తోంది. చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి భోజ్‌పురి నటుడు ఇర్ఫాన్ ఖాన్
కొందరు వ్యక్తులు బార్బర్ జిహాద్ కు పాల్పడుతూ ఉన్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఈ కథనం జూలై 2013 నాటిది. ఇటీవలిది కాదని స్పష్టంగా తెలుస్తోంది. చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి భోజ్‌పురి నటుడు ఇర్ఫాన్ ఖాన్, అతని స్నేహితుడు సంజయ్ యాదవ్ అని కథనం తెలిపింది. ఈ ఇద్దరు యువకులు క్రెడిట్ కార్డ్ కుంభకోణాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టయ్యారు. ముంబై పోలీసులు బార్బర్‌ను అరెస్టు చేశారనే వాదనతో వైరల్ పోస్టులు షేర్ చేస్తున్నారు. వీరు చాలా ఏళ్లుగా బార్బర్ జిహాద్ చేస్తున్నారని.. ముంబైలో బార్బర్‌గా ఉన్న వ్యక్తి తన హిందూ కస్టమర్లకు ఎయిడ్స్‌ను వ్యాప్తి చేయడానికి బ్లేడ్‌ను ఉపయోగిస్తూ వస్తున్నట్లు.. అందు కోసం ప్రత్యేకంగా బ్లేడ్ లు ఉపయోగిస్తూ వస్తున్నారని పోస్టుల్లో తెలిపారు.
“*ब्रेकिंग न्यूज... मुंबई नाई जिहाद एक मुलले ने पुलिस के सामने कुबूल किया कि मस्जिदों में नाईजेहाद के लिए पैसा मिलता है । जिसमें हिंदुओं को एड्स के ब्लेड से हल्का सा चीरा लगाने के लिए सिखाया जाता है.। सभी नजदीकी लोगों को बताना है कि किसी हिंदू नाई से ही सेव व कटिंग कराये।*” అంటూ హిందీ భాషలో పోస్టులు పెట్టారు."బ్రేకింగ్ న్యూస్... ముంబైలో సరికొత్త జీహాద్ బయటపడింది. బార్బర్ జీహాద్ కు పాల్పడుతున్న వారికి మసీదుల్లో డబ్బులు ఇస్తూ వస్తున్నారు. బార్బర్ జీహాద్ కోసం డబ్బులు అందుతున్నాయని ముల్లా పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఇందులో భాగంగానే ముస్లిం క్షౌరకులకు ఎయిడ్స్ వ్యాపించేలా బ్లేడుతో కోత పెట్టడం నేర్పిస్తారు. హిందువులందరూ కేవలం హిందూ మంగలి వద్దకు మాత్రమే వెళ్లి తమ షేవింగ్, కటింగ్ చేయించుకోవాలని సూచిస్తూ ఉన్నాం." అని అందులో తెలిపారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. వైరల్ ఇమేజ్ కోసం సెర్చ్ చేసినప్పుడు, ఇండియాటీవీ వెబ్‌సైట్‌లో ప్రచురించిన కథనాన్ని మేము కనుగొన్నాము. ఇందుకు సంబంధించిన వ్యాసం జూలై 2013 నాటిదిగా ఉంది. ఇది ఈ మధ్య చోటు చేసుకున్న ఘటన అయితే కాదు. చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి భోజ్‌పురి నటుడు ఇర్ఫాన్ ఖాన్, అతని స్నేహితుడు సంజయ్ యాదవ్ అని తెలిసింది. వీరిని క్రెడిట్ కార్డ్ దొంగతనం, మోసం ఆరోపణలపై ముంబై పోలీసులు అరెస్టు చేశారని కథనం పేర్కొంది. ఈ కథనంలో భాగస్వామ్యం చేయబడిన స్క్రీన్‌షాట్ వైరల్ పోస్ట్‌లలో ఉపయోగిస్తూ ఉన్నారు.క్రెడిట్ కార్డులు, చెక్ బుక్‌లు, బిల్లు పుస్తకాలు దొంగిలించి, వాటిని ఉపయోగించి డ్రా చేసిన డబ్బుతో విలువైన వస్తువులను కొనుగోలు చేస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.2013లో ఇండియా టీవీ రిపోర్ట్‌లో ప్రచురించిన చిత్రంతో వైరల్ ఇమేజ్ ను పోల్చడం మీరు చూడవచ్చు.
ఇండియాటీవీ యూట్యూబ్ ఛానెల్‌లో “క్రెడిట్ కార్డ్ దొంగతనం చేసినందుకు ముంబై పోలీసులు భోజ్‌పురి నటుడు ఇర్ఫాన్ ఖాన్‌ను అరెస్టు చేశారు” (“Mumbai police arrests Bhojpuri actor Irfan Khan for credit card theft”.) అనే శీర్షికతో ప్రచురించబడిన వీడియోను కూడా మేము కనుగొన్నాము.Full View https://www.dailymotion.com/video/x1213f2 బార్బర్ జీహాద్ లో భాగంగా ఎవరినైనా ముంబై పోలీసులు అరెస్ట్ చేశారా అనే విషయమై మేము గూగుల్ లో వెతికాము. ఎక్కడా కూడా అందుకు సంబంధించిన నివేదికలను మేము కనుగొనలేకపోయాము.కాబట్టి, వైరల్ దావా తప్పు. వైరల్ అవుతున్న ఫోటో 10 సంవత్సరాల పాతది. క్రెడిట్ కార్డ్ దొంగతనం, మోసాలలో అరెస్టయిన భోజ్‌పురి నటుడికి సంబంధించిన ఫోటోలు ఇవని తెలుస్తోంది.
Claim : Mumbai police arrested a barber trying to spread AIDS among Hindus
Claimed By : Social Media Users
Fact Check : False