ఫ్యాక్ట్ చెక్: సీఎంఆర్ షాపింగ్ మాల్స్ కు సంబంధించి వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు
CMR షాపింగ్ మాల్ హోర్డింగ్‌లో షేర్వాణీ ధరించిన వ్యక్తి, స్కల్ క్యాప్ ధరించి ఉన్నాడు. అతడి పక్కనే పట్టు చీర కట్టుకున్న మహిళ కూడా ఉంది. ఈ ఫోటో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినదని.. కర్ణాటకలో లవ్ జిహాద్ ప్రకటనకు సంబంధించినదనే వాదనతో ప్రచారం చేస్తున్నారు.

ఈ చిత్రం క్రింద హిందీ ఓ క్యాప్షన్ ను పెట్టి షేర్ చేస్తున్నారు. ముస్లిం పురుషులు హిందూ మహిళలను తీసుకురావాలని 10 శాతం నుండి 50 శాతం వరకు తగ్గింపు పొందండని చెబుతూ ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కర్ణాటకలో ఈ హోర్డింగ్ పెట్టారని అంటున్నారు.
https://www.facebook.com/photo?fbid=1401254853941666
https://www.facebook.com/photo/?fbid=2249682735420024
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. ఈ హోర్డింగ్ ఇప్పటిది కాదు.. 2019 సంవత్సరానికి. అది కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినది.
జాగ్రత్తగా గమనిస్తే.. రంజాన్ సందర్భంగా 10-50% వరకు తగ్గింపును అందిస్తున్న CMR షాపింగ్ మాల్ కు సంబంధించిన హోర్డింగ్ అని మనకు అనిపిస్తుంది. హోర్డింగ్‌పై కనిపించే చిరునామాలన్నీ తెలంగాణ రాష్ట్రానికి చెందినవి, వీటిలో సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, సిద్దిపేట, మహబూబ్‌నగర్ ప్రాంతాలు ఉన్నాయి.
మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, వైరల్ మెసేజ్‌లలోని ఇమేజ్ 2019లో చాలా మంది యూజర్‌లు పోస్ట్ చేసినట్లు మేము కనుగొన్నాము.
ఒక ఫేస్ బుక్ యూజర్ “#जेहाद का एक ओर #नया उदहारण आया #सामने #CMR #मॉल ने जारी किया #जेहाद को बढ़ाने वाला पोस्टर सारे संगठन मिल कर इसके ऊपर करवाई करवाने में सहयोग करे। D.No. 28-2-51, Jail Rd, Jagadamba Centre, Visakhapatnam , Andhra Pradesh 530020” అంటూ పోస్టు చేయడం మనం చూడొచ్చు. లవ్ జీహాద్ కు మద్దతుగా సీఎంఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం పని చేస్తోందని.. మనం అడ్డుకోవాలంటూ కొన్ని గ్రూపులు ఈ పోస్టులు పెట్టాయి.
https://www.facebook.com/
https://www.facebook.com/
ఫ్యాక్ట్ చెకింగ్:

జూన్ 2019లో ఈ చిత్రాన్ని షేర్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.. ఈ వివాదాస్పద రంజాన్ బ్యానర్ ను CMR మాల్ యాజమాన్యం వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. రంజాన్ బ్యానర్ కోసం ఒక ముస్లిం వ్యక్తితో కలిసి హిందూ మహిళను ఎందుకు నిలబెట్టాలని వారిని ప్రశ్నించారు. వెంటనే నగరం నలుమూలల నుంచి ఈ బ్యానర్‌ను తొలగించాలని కోరారు. "మీరు లవ్‌జిహాద్‌ను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నారా.? ముస్లిం యువకుడితో హిందూ మహిళ ఎందుకు? మీరు ఈ రకమైన బ్యానర్‌ను తొలగించకపోతే మేము మీ మాల్‌ను నిషేధిస్తాము" అని రాజా సింగ్ హెచ్చరించారు.
CMR షాపింగ్ మాల్ యాజమాన్యం వివాదాస్పద హోర్డింగ్ విషయంలో క్షమాపణ చెబుతూ ప్రకటన జారీ చేసినట్లు మేము కనుగొన్నాము. క్షమాపణ నోట్‌లో.. CMR తెలంగాణ గ్రూప్ నుండి జరిగిన పొరపాటుకు క్షమాపణలు కోరారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, మత సమూహాల మధ్య విభేదాలు సృష్టించే ఉద్దేశం మాకు లేదని తెలిపారు. మేము అన్ని మతాలకు మద్దతు ఇస్తున్నామని, ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రతి వర్గాన్ని గౌరవిస్తామన్నారు. అన్ని హోర్డింగ్‌లు తొలగించామని.. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకూడదని మేము హామీ ఇస్తున్నామని తెలిపారు.
ఈ హోర్డింగ్ కు CMR ఆంధ్రప్రదేశ్ గ్రూప్ కు ఎటువంటి సంబంధం లేదని మరో ప్రకటన వచ్చింది.
ఒక ముస్లిం వ్యక్తి హిందూ మహిళతో ఉన్నట్లుగా అనిపించే హోర్డింగ్ ఫోటో 2019 లో తెలంగాణలోని CMR షాపింగ్ మాల్ పెట్టింది.. ఆ తర్వాత క్షమాపణలు కూడా తెలిపింది. ఇది కర్ణాటకలో ఇటీవల కనిపించిందనే వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim : Love Jihad in Karnataka
Claimed By : Social Media Users
Fact Check : False