తెలుగు దేశం నాయకురాలితో పవన్ కళ్యాణ్ ఉన్న వైరల్ ఫోటో.. ఎవరో మార్ఫింగ్ ద్వారా తయారుచేసినదే..
జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ఒక మహిళ పక్కన కూర్చున్నట్లుగా ఉన్న ఫోటోను.. మన నాలుగో వదిన అనుకుంట 🙈🙄😂.. అనే కామెంట్ తో సోషల్ మీడియా యూజర్లు గత ఆదివారం నుంచి షేర్ చేస్తున్నారు.
జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ఒక మహిళ పక్కన కూర్చున్నట్లుగా ఉన్న ఫోటోను.. మన నాలుగో వదిన అనుకుంట .. అనే కామెంట్ తో సోషల్ మీడియా యూజర్లు గత ఆదివారం నుంచి షేర్ చేస్తున్నారు. ఈ మధ్య తెలుగుదేశం పార్టీ తమ మహానాడుని ఒంగోలులో నిర్వహించింది. అందులో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి కుమార్తె, తెలుగుదేశం నాయకురాలు కావాలి గ్రీష్మ మాట్లాడుతూ.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు తొడగొట్టి మరీ ఛాలెంజ్ విసిరారు. అప్పటి నుంచి ఆమె ట్రోల్ అవుతున్నారు.
TeluguPost.com పరిశీలనలో వైరల్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వ్యక్తులలో N చిరంజీవి అనే యూజర్ వారి ట్విట్టర్ హ్యాండిల్ @NCHIRAN17457886 నందు, ఫేస్ బుక్ అకౌంట్ nallabothula.meechiranjeevi నందు మే 29 రాత్రి 09.35 కి అప్లోడ్ చేశారు.
The photo is uploaded on both twitter and facebook at 09.35 PM on May 29. The posts can be found అటు
అదే ఫోటోను మరో యూజర్ ప్రసాద్ జగనిజం కూడా కొంత సేపటి తర్వాత షేర్ చేశారు.
ఈ అప్లోడర్ల ప్రొఫైల్, ఆ పోస్టులకు వచ్చిన కామెంట్స్ గమనించినప్పుడు అవన్నీ గ్రీష్మ ను ట్రోల్ చేయడానికి ఉద్దేశించే ఆ ఫోటోను తయారుచేశారని అర్ధం అవుతుంది.
Fact Check
వైరల్ అవుతున్న ఫోటోను పవన్ కళ్యాణ్, గ్రీష్మ పిక్చర్స్ గా విడదీసి గూగుల్, యాండెక్స్ నందు రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. పవన్ కళ్యాణ్ ఫోటో.. ఫిబ్రవరి 20, 2022 న, ఆయన నరసాపురంలో మత్స్యకార అభ్యున్నతి సభకు హాజరాయిన సమయంలో తీయబడినట్లుగా తేలింది. ఆ ఫోటోను సీనియర్ జర్నలిస్టు, సినీ పీఆర్వో ఎల్ వేణుగోపాల్, మరొక పవన్ కళ్యాణ్ అభిమాని అదేరోజు సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాటిని ఇక్కడ చూడవచ్చు.
ఫేస్ బుక్ లోని తన అధికార పేజీలో ప్రొఫైల్ పిక్చర్ గా గ్రీష్మ ఈ ఫోటోను సెప్టెంబర్ 25, 2021 న అప్లోడ్ చేశారని ఆమె ఖాతా పరిశీలించినపుడు తెలిసింది.
ఈ ఆధారాలతో.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, కావలి గ్రీష్మ పక్కపక్కనే ఉన్నట్లుగా వైరల్ అవుతున్న ఫోటో నిజమైనది కాదని, ఎవరో ఫోటో ఎడిటింగ్ టూల్స్ ద్వారా తయారు చేసినదే అని, అర్ధం అవుతుంది.