ఫ్యాక్ట్ చెక్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో చితకొట్టుకున్న ప్రయాణీకులు అంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు

Confrontations are more common on public transportation, where passengers become restless on minor topics and fight;

Update: 2024-10-18 09:44 GMT
passengers fight in the flight parked at shamshabad airport, Viral video is not the recent incident of passengers fighting in an Aeroplane at Shamshabad Airport, facts on passengers fighting in an Aeroplane at Shamshabad Airport, factcheck news telugu, viral news Shamshabad Airport

Shamshabad Airport

  • whatsapp icon

ప్రజా రవాణాలో ఘర్షణలు సర్వసాధారణం. చాలా సందర్భాల్లో ప్రయాణీకులు చిన్న చిన్న విషయాలపై కూడా గొడవ పడుతూ ఉంటారు. రైలు, బస్సుల్లోనే కాదు ఇప్పుడు విమానాల్లో కూడా గొడవలు సర్వసాధారణమయ్యాయి. కొన్ని కొన్ని సార్లు విమానయాన సంస్థల్లో పని చేసే వారితోనూ, ఎయిర్ పోర్టు సిబ్బందితోనూ గొడవలు పడుతూ ఉంటారు కొందరు.

ఇలాంటి గొడవలు జరిగినప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతూ ఉంటాయి. హైదరాబాద్‌లోని శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (ఆర్‌జిఐఎ)లో ఓ గొడవ జరిగిందంటూ విమానంలో ప్రయాణికుల మధ్య జరిగిన ఘర్షణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో గొడవ జరిగినట్లు బిగ్ టీవీ యూట్యూబ్ ఛానెల్ వీడియో ప్రచురించింది. సీటు విషయంలో గొడవ వచ్చిందని యాంకర్ పేర్కొంది. విమాన ప్రయాణంలో ప్రయాణికులు సీట్లు బుక్ చేసుకున్నప్పటికీ.. మరో సీటులో కూర్చొని ఓ ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడని అందులో తెలిపారు.
“విమానంలో పొట్టు పొట్టు కొట్టుకున్నారు | Two Passengers Fighting On Plane Before Take-Off | BIG TV” అంటూ వీడియోను పోస్టు చేశారు.
Full View
“విమానంలో సీట్ల కోసం లొల్లి.. చితకొట్టుకున్న ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘటన” అంటూ మరికొందరు ఎక్స్ యూజర్లు కూడా వీడియోను పోస్టు చేశారు.
“శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్లైన్స్ విమానంలో గొడవ ఉద్రిక్తత. సీట్ల కోసం గొడవ పడుతున్న ప్రయాణికులు షాకు గురైన తోటి ప్రయాణికులు.” అనే వాదనతో కూడా వీడియోను వైరల్ చేశారు.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. ఆ వీడియో పాతది, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జరిగిన సంఘటన కాదు.
వైరల్ వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను తీసుకుని మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. 2022 సంవత్సరంలో ప్రచురించిన అనేక సోషల్ మీడియా పోస్ట్‌లను మేము కనుగొన్నాము.
ఒక X వినియోగదారు వీడియోని డిసెంబర్ 29, 2022న “Fight Breaks Out Between Passengers in Thai Smile Airlines Flight From Bangkok to India.” అనే శీర్షికతో పోస్ట్ చేసారు. దీన్ని బట్టి, ఇది బ్యాంకాక్ నుండి కోల్ కతా కు వస్తున్న విమానంలో జరిగిన ఘటన అని భావించవచ్చు.
News mobile India అనే పేజీలో కూడా “WATCH | Scuffle between passengers inside a Thai Smile Airways Bangkok-Kolkata flight” అంటూ వీడియోను పోస్టు చేశారు.
ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకారం బ్యాంకాక్ నుండి కోల్‌కతాకు వస్తున్న విమానంలో గొడవ ప్రారంభమైంది. ఫ్లైట్ అటెండెంట్ భద్రతా హెచ్చరికలను ధిక్కరించి ప్రయాణికుల్లో ఒకరు గొడవ ప్రారంభించారు. సీట్లను నిటారుగా ఉంచాలని క్యాబిన్ సిబ్బంది ప్రయాణికులకు సూచించారు. విమానంలో టేకాఫ్, ల్యాండింగ్ కోసం ఇది సాధారణ భద్రతా విధానం. కుర్చీలు బెండ్ అయి ఉంటే, అత్యవసర పరిస్థితుల్లో ఖాళీ చేయడం సవాలుగా మారవచ్చు.
థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్ ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేసింది. ఫ్లైట్ సేఫ్టీ ప్రోటోకాల్‌లను అనుసరించేటప్పుడు మేము అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉంటామని ఎయిర్‌లైన్ ఒక ట్వీట్‌లో పేర్కొంది.
కాబట్టి, వైరల్ వీడియోలో కనిపించిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో జరిగింది కాదు. వీడియో పాతది, బ్యాంకాక్ నుండి కోల్‌కత్తా వెళుతున్న విమానంలో ఈ ఘటన జరిగింది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉంది.
Claim :  ఇటీవల శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని విమానంలో ప్రయాణీకులు కొట్లాడుకున్న ఘటనకు సంబంధించిన వీడియో
Claimed By :  Twitter and YouTube users
Fact Check :  Misleading
Tags:    

Similar News