ఫ్యాక్ట్ చెక్: ఓ భారీ ఆక్టోపస్ కారు మీద ఎక్కి ధ్వంసం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
2023, సెప్టెంబరు చివరి వారంలో భారీ వర్షాల కారణంగా న్యూయార్క్ నగరంలో అనేక ప్రాంతాల్లో వరదలు వచ్చాయి.
2023, సెప్టెంబరు చివరి వారంలో భారీ వర్షాల కారణంగా న్యూయార్క్ నగరంలో అనేక ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. నగరంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. వరదల కారణంగా న్యూయార్క్ నగరంలోని కార్ పార్కింగ్ స్థలంలో భారీ ఆక్టోపస్ కారు పైకి ఎక్కి.. ధ్వంసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఒక పెద్ద ఆక్టోపస్ కార్ పార్కింగ్ ప్రాంతంలో ఓ పెద్ద కారుపైకి ఎక్కి.. దాని టెంటకిల్స్ తో విండ్‌షీల్డ్‌ను ధ్వంసం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
“#BREAKING: భారీ వరదల కారణంగా న్యూయార్క్ నగరంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మీరు మీ కారును పార్క్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి." అంటూ వీడియోను వైరల్ చేస్తోంది.
“#BREAKING: భారీ వరదల కారణంగా న్యూయార్క్ నగరంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మీరు మీ కారును పార్క్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి." అంటూ వీడియోను వైరల్ చేస్తోంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.వీడియోను నిశితంగా పరిశీలించగా.. కార్ల మీద ఉన్న లైసెన్స్ ప్లేట్స్ ఇంగ్లీష్ లో లేవని గుర్తించాం.
వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ తీసుకుని చూడగా అది అరబిక్ లో ఉందని గుర్తించాం. అది ట్రాన్స్ లేట్ చేయగా.. “Qatar 9807” అని అందులో ఉంది. ఇక తెలుగు రంగు ఎస్.యు.వి. లైసెన్స్ ప్లేట్ మీద ‘Qatar @ghost3dee’ అని ఉంది. వీడియో లో @ఘోస్టు౩దీ వాటర్ మార్క్ ఉండడాన్ని చూశాం.
ghost3dee అని సెర్చ్ చేయగా.. Alex Z అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను మనం చూడొచ్చు. అందులోని బయోలో సీజీ జనరజలిస్ట్ ఇన్ ఖతార్ అని ఉంది.
ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేయగా.. మీరు పార్కింగ్ లో మీ వాహనాన్ని ఉంచినప్పుడు ఓ పెద్ద ఆక్టోపస్ వచ్చి మీ కారును ధ్వంసం చేస్తే.. అనే విషయమై కింద వివరించారు. అలాగే అతడు ఈ వీడియోను రూపొందించడానికి తీసుకున్న జాగ్రత్తలు, చేసిన పనులను కూడా తెలిపారు. పలు ప్లగ్ ఇన్స్ తో ఎలా రూపొందించాను అనే విషయమై కూడా చెప్పుకొచ్చారు. సింగిల్ కీఫ్రేమ్ ను మార్చడం.. సిమ్ చెక్ పాయింట్స్.. లాంటి వాటి సహాయంతో వీడియోను తయారు చేశానని తెలిపారు. ఇంతకు ముందు కూడా ఓ వీడియో చేశానని కూడా తెలిపాడు.
సౌండ్ బై - @audioflag రెండర్డ్ ఆన్ ఫ్రేమ్స్ ఫ్రమ్- @snaprenderfarm” అంటూ వీడియోను పోస్టు చేశారు.
snaprender.farmని ఉపయోగించి వీడియో రెండర్ చేశారని పోస్ట్ లో పేర్కొన్నారు. Snap Renderfarm డిజైనర్లు, ఆర్కిటెక్ట్‌లు, యానిమేటర్లు, మోషన్ డిజైనర్లు, 3D గ్రాఫిక్స్‌తో నిమగ్నమైన ఎవరికైనా పూర్తి చిత్రాన్ని పొందడానికి సులభమైన, వేగవంతమైన మార్గంతో అందిస్తుంది. 3D ఆర్టిస్ట్స్ 3D ఇమేజ్ లను తీసుకోవాలంటే.. ఎక్కువసేపు ఎదురుచూస్తూ ఉండకుండా.. సృజనాత్మకతపై వారి శక్తిని కేంద్రీకరించే అవకాశాన్ని కల్పిస్తారు.
YouTube ఛానెల్ @ghost3deeలో కూడా అదే ఆర్టిస్ట్ ద్వారా వీడియో షేర్ చేశారని కూడా మేము కనుగొన్నాము.
ఈ అకౌంట్ లో ఎన్నో కంప్యూటర్-సృష్టించిన వీడియోలు ఉన్నాయి.
అందువల్ల, ఇటీవల న్యూయార్క్ నగరంలో భారీ వరదలు సంభవించిన సమయంలో ఆక్టోపస్ కారు పైకి ఎక్కి దానిని ధ్వంసం చేసినట్లు చూపుతున్న వైరల్ వీడియోలో ఎటువంటి నిజం లేదు. ఈ వీడియో అలెక్స్ Z అనే కళాకారుడు రూపొందించిన CGI వీడియో.
Claim : The viral video shows an Octopus climbing up a car and destroying it during the recent mass flooding and state of emergency in New York city
Claimed By : Social media users
Fact Check : False