ఫ్యాక్ట్ చెక్: అయోధ్య రామ మందిరం గురించి కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారంటూ జరుగుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు

అయోధ్య రామమందిరంలోబాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రామ్ లల్లా విగ్రహాన్ని ఆవిష్కరించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 8000 మంది అతిథులు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరయ్యారు

Update: 2024-01-26 09:23 GMT

Mohalla Assi

అయోధ్య రామమందిరంలోబాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రామ్ లల్లా విగ్రహాన్ని ఆవిష్కరించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 8000 మంది అతిథులు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరయ్యారు. కొన్ని కోట్ల మంది ఈ కార్యక్రమం లైవ్ టెలీకాస్ట్ ను వివిధ మాధ్యమాల్లో వీక్షించారు.

అయోధ్య రామమందిరంపై సినిమా తీస్తున్నారని.. ఆ సినిమాకు సంబంధించిన సన్నివేశాలను ఈ వీడియో చూపుతుందనే వాదనతో రెండు వేర్వేరు వీడియో క్లిప్పింగ్‌లు వైరల్ అవుతూ ఉన్నాయి.

“अयोध्या राम मंदिर युद्ध पर बनी न्यू मूवी” అనే వాదనతో పోస్టులు పెట్టారు. అయోధ్య రామ మందిరం మీద తీస్తున్న కొత్త సినిమా అన్నది ఆ పోస్టుల వాదన.

వీడియో -1

1990లో అయోధ్యలో జరిగిన నిరసనల్లో పాల్గొనేందుకు సన్నీ డియోల్ ఇంటి నుండి బయలుదేరిన దృశ్యాలను మొదటి వీడియోలో చూపిస్తున్నారు.
Full View

Full View

వీడియో -2

ఈ వీడియోను కూడా అదే వాదనతో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పలువురు అయోధ్య రామ మందిరం గురించి చర్చిస్తున్న దృశ్యాలు, ప్రజలు 'జై శ్రీ రామ్' నినాదాలతో వీధుల్లో ర్యాలీలు చేస్తున్న దృశ్యాలను ఇందులో చూడొచ్చు.

Full View

Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

అయోధ్య రామమందిరంపై తీస్తున్న కొత్త చిత్రానికి సంబంధించినవి అంటూ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆ వీడియోలు సన్నీ డియోల్ నటించిన “మొహల్లా అస్సి” సినిమాకు సంబంధించినవి.
మేము రెండు వీడియోల నుండి తీసుకున్న కీలక ఫ్రేమ్‌లను గూగుల్ లో సెర్చ్ చేయగా 'జోర్దార్ ట్రెండింగ్ మూవీస్' అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా వైరల్ వీడియోలలో ఒకటి షేర్ చేశారని మేము కనుగొన్నాము. “भगवान को तो छोड़ दो सालो | Sunny Deol Best Dialogue | Mohalla Assi” అనే టైటిల్ తో వీడియోను షేర్ చేశారు. అక్టోబర్ 15, 2022న వీడియోను అప్లోడ్ చేశారు. ఈ టైటిల్ ను బట్టి సన్నీ డియోల్ సినిమా అనే క్లారిటీ మనకు వస్తుంది.

Full View

“Mohalla Assi” అనే టైటిల్ ను యూట్యూబ్ లో సెర్చ్ చేయగా.. ‘Bollywood Movies’ అనే యూట్యూబ్ ఛానల్ లో పూర్తీ సినిమాను అప్లోడ్ చేశారు. “Mohalla Assi (Full HD Movie) – Sunny Deol II Sakshi Tanwar II Ravi Kishan II Saurabh Shukla" అనే టైటిల్ తో సినిమాను జులై 2020లోనే అప్లోడ్ చేశారు. వైరల్ వీడియోలోని విజువల్స్ సినిమాలో పలు సందర్భాల్లో చూడొచ్చు.

Full View
మొహల్లా అస్సీ సినిమాను.. డాక్టర్ కాశీ నాథ్ సింగ్ రచించిన ప్రసిద్ధ హిందీ నవల ‘కాశీ కా అస్సీ’ ఆధారంగా రూపొందించారు. ఈ సినిమా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. ఈ సినిమా విడుదలకు ముందు పలు సమస్యలు వచ్చాయి.

hindi.news18.com ప్రకారం, సన్నీ డియోల్ నటించిన మెగా ఫ్లాప్ చిత్రం 2018 సంవత్సరంలో వచ్చింది. సన్నీ డియోల్ కెరీర్‌లో అత్యంత వివాదాస్పద చిత్రంగా పేరు తెచ్చుకుంది.

'మొహల్లా అస్సీ' షూటింగ్ 2011 జనవరిలో మొదలై 2015లో పూర్తయింది. ఈ సినిమా చేయడానికి 4 ఏళ్లు పట్టింది. దీని చిత్రీకరణ కోసం మేకర్స్ రూ. 20 కోట్లు వెచ్చించారు. ట్రైలర్ జూన్ 2015లో విడుదలైంది. అయితే ఈ సినిమా పూర్తి HD ప్రింట్‌ ను లీక్ చేశారు. ఏప్రిల్ 2016లో, CBFC ఈ చిత్రాన్ని నిషేధించింది. డిసెంబర్ 2017లో ఢిల్లీ హైకోర్టు ఈ సినిమాపై నిషేధాన్ని ఎత్తివేసింది.

కాబట్టి, అయోధ్య రామ మందిరం గురించి సినిమా తీస్తున్నారనే వాదనలో ఎలాంటి నిజం లేదు. సన్నీ డియోల్ నటించిన 'మొహల్లా అస్సీ' సినిమాకు సంబంధించిన వీడియో వైరల్ అవుతూ ఉంది.
Claim :  Viral videos show scenes from the new upcoming film on Ayodhya Ram Mandir
Claimed By :  Facebook Users
Fact Check :  False
Tags:    

Similar News