ఆమె అంత కాష్ట్లీనా?
ఇప్పుడు బుల్లితెర మీద ప్రసారమవడానికి బిగ్ బాస్ సీజన్ 3 నాగార్జున వ్యాఖ్యాతగా రెడీ అవుతుంది. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ 3 ని స్టార్ [more]
ఇప్పుడు బుల్లితెర మీద ప్రసారమవడానికి బిగ్ బాస్ సీజన్ 3 నాగార్జున వ్యాఖ్యాతగా రెడీ అవుతుంది. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ 3 ని స్టార్ [more]
ఇప్పుడు బుల్లితెర మీద ప్రసారమవడానికి బిగ్ బాస్ సీజన్ 3 నాగార్జున వ్యాఖ్యాతగా రెడీ అవుతుంది. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ 3 ని స్టార్ మా యాజమాన్యం… అందులోని కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. ఇప్పటికే పటాస్ శ్రీముఖి, బ్యాట్మెంటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా లాంటి వారు బిగ్ బాస్ 3 లిస్ట్ లో ఉన్నట్లుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే నాగార్జున హోస్ట్ అనేది కూడా కేవలం ప్రచారమే కానీ… నాగార్జునే హోస్ట్ అని స్టార్ మా యాజమాన్యం నుండి ఎటువంటి ప్రకటన లేదు. మరి తమిళనాట బిగ్ బాస్ 3 మొదలైపోయింది కూడా.
తాజాగా బ్యాట్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా బిగ్ బాస్ 3 లో పార్టిసిపేట్ చేస్తున్నట్లు వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ… బిగ్ బాస్ త్రీ కంటెస్టెండ్ లో జ్వాలా గుత్తా లేదంటున్నారు. ముందుగా ఆమె పేరు పరిశీలించినమాట వాస్తవమే అని… అందుకు జ్వాలా కూడా ఒప్పుకుందని కానీ… ఇప్పుడు బిగ్ బాస్ లో పాల్గొనాలంటే భారీ పారితోషకం ఇవ్వాల్సిందిగా జ్వాలా గుత్తా స్టార్ మా ని డిమాండ్ చెయ్యడంతో… బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెని వద్దనుకున్నారని సమాచారం. ఇది తన ఇమేజ్‌కి దెబ్బగా భావించిన జ్వాలా ట్విట్టర్ వేదికగా తాను బిగ్‌బాస్ షోలో పాల్గొనడం లేదని ట్వీట్ చేసింది. మరి ఈ బిగ్ బాస్ సీజన్ లో వరుణ్‌సందేశ్, ఆర్.జే,హేమంత్, శ్రీముఖి పేర్లు మాత్రం ఖరారైనట్లుగా సమాచారం.