రాజమౌళి #RRR పై కొత్త గాసిప్స్..!

రాజమౌళి తన స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి #RRR షూటింగ్ చేసుకుంటూ.. తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు [more]

;

Update: 2019-02-05 06:57 GMT

రాజమౌళి తన స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి #RRR షూటింగ్ చేసుకుంటూ.. తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు బయటికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇద్దరితో తన సెకండ్ షెడ్యూల్ ని మొదలు పెట్టాడు. #RRR మొదటి షెడ్యూల్ తో పాటు సెకండ్ షెడ్యూల్ లోనూ ఎన్టీఆర్, చరణ్ కాంబో సీన్స్ నే తెరకెక్కిస్తున్నాడు. అందుకే ఇప్పటివరకు హీరోయిన్స్ విషయాన్ని కూడా బయటికి పొక్కకుండా రాజమౌళి జాగ్రత్తపడ్డాడు. ఇక హీరోయిన్స్ విషయంలో మీడియా రోజుకో వార్త సృష్టిస్తుంది.

కథ ముందే చెప్పకపోవడంతో…

తాజాగా అలియా భట్.. చరణ్ కి జోడిగా ఎంపికయ్యిందనే న్యూస్ హైలెట్ అయ్యింది కూడా. ఇక మొదటి నుండి #RRR కథపై రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. #RRR కథ 1940 నేపథ్యంలో ఉండబోతుందని… ఆ సమయంలో రామ్ చరణ్ జమీందారుగా, ఎన్టీఆర్ చాలా పేదవానిగా కనిపిస్తాడని.. ఆలాగే ఒక జన్మలో ఎన్టీఆర్, చరణ్ లు అన్నదమ్ములుగా పుడితే.. మరుజన్మలో ఎన్టీఆర్, చరణ్ లు స్నేహితులుగా కనిపిస్తారట. అయితే ఒక జన్మలో స్నేహితులుగా చరణ్, ఎన్టీఆర్ ఒక బలమైన కారణంతో విడిపోతారని రకరకాల గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. రాజమౌళి మాత్రం వీటికి స్పందించడం లేదు. అలాగే ఎప్పుడూ కథ చెప్పి సినిమా మొదలు పెట్టే రాజమౌళి.. ఈసారి కథను దాచేసే సరికి అందరూ రాజమౌళి సినిమా విషయంలో అనేక గాసిప్స్ ప్రచారంలోకి తీసుకొస్తున్నారు.

Tags:    

Similar News