అఖిల్ సరసన చరణ్ హీరోయిన్..?

అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన నాలుగో సినిమా మీద పూర్తి దృష్టి పెడుతున్నాడు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాల ఫ్లాప్స్ తో అఖిల్ కాస్త కంగారు [more]

Update: 2019-03-21 07:52 GMT

అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన నాలుగో సినిమా మీద పూర్తి దృష్టి పెడుతున్నాడు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాల ఫ్లాప్స్ తో అఖిల్ కాస్త కంగారు పడినా తండ్రి నాగ్ ఇచ్చిన సపోర్ట్ తో ఆచితూచి తన నాలుగో సినిమా వైపు అడుగులు వేస్తున్నాడు. ఈ సినిమాని ముందు ఆది అన్న సత్య పినిశెట్టి దర్శకత్వంలో చేస్తాడని అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ తన నాలుగో సినిమాని చేస్తున్నాడనే టాక్ ఉంది. ఇప్పటికే భాస్కర్ స్క్రిప్టు సిద్ధం చేయడంతో.. ప్రీ ప్రొడక్షన్ లో భాగంగా ఈ సినిమాలో నటించబోయే నటీనటులు, టెక్నీషియన్స్ మీద దృష్టి పెట్టినట్లుగా వార్తలొస్తున్నాయి.

హీరోయిన్ గా కియారా అద్వానీ

అయితే అఖిల్ కి హీరోయిన్ గా భరత్ అనే నేనుతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీని ఎంపిక చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారట. మరి కియారాకి కాలం కలిసి రాక రామ్ చరణ్ వినయ విధేయ రామ పోయింది. అందుకే ఆమెకొచ్చిన అల్లు అర్జున్ – త్రివిక్రమ్ అవకాశం చేజారింది. మరి ఈ భామ అఖిల్ 4వ సినిమాలో అయినా ఫిక్స్ అవుతుందో లేదో చూడాలి. ఇప్పటివరకు ఇద్దరు హీరోయిన్స్ ని టాలీవుడ్ కి పరిచయం చేసిన అఖిల్ మొన్న మిస్టర్ మజ్నులో కూడా కొత్త హీరోయిన్ నిధి అగర్వాల్ తోనే రొమాన్స్ చేసాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ తో రొమాన్స్ కి రెడీ అవుతున్నాడనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది.

Tags:    

Similar News