చరణ్ – బోయపాటి – దానయ్య వార్..!

రామ్ చరణ్ తన సినిమా ఫ్లాప్ పై స్పందిస్తూ ఒక ప్రెస్ నోట్ ని ఎప్పుడైతే విడుదల చేసాడో అప్పటి నుండి… రామ్ చరణ్ లేఖపై అనేక [more]

Update: 2019-02-07 10:28 GMT

రామ్ చరణ్ తన సినిమా ఫ్లాప్ పై స్పందిస్తూ ఒక ప్రెస్ నోట్ ని ఎప్పుడైతే విడుదల చేసాడో అప్పటి నుండి… రామ్ చరణ్ లేఖపై అనేక రకాల వార్తలు ప్రచారంలోకి వ‌చ్చాయి. ఆ లేఖలో దర్శకుడు బోయపాటి పేరుని రామ్ చరణ్ ప్రస్తావించకపోవడంతో.. అనేక రకాల పుకార్లు సోకల్ మీడియాలో షికార్లు చెయ్యడం మొదలు పెట్టాయి. ఇక వినయ విధేయ రామకి ఫైనల్ రన్ లో బయ్యర్లకు 30 కోట్ల నష్టాలు వచ్చాయి. సినిమా ఫ్లాప్ అయినా నిర్మాత దానయ్య సినిమాని బయ్యర్లకు అమ్మేసి సేఫ్ అయ్యాడు. కానీ రామ్ చరణ్ తాజా నిర్ణయంతో ఇప్పుడు నిర్మాత దానయ్య, రామ్ చరణ్ కలిసి బయ్యర్ల నష్టాలను పూడ్చే ప్రయత్నం మొదలెట్టారట.

పారితోషకం వెనక్కు ఇవ్వాల‌ని…

ముప్పై కోట్ల నష్టంలో సగం అంటే 15 కోట్లు అయినా వెనక్కి ఇచ్చేయాలని దానయ్య, చరణ్ లు నిర్ణయించారట. రామ్ చరణ్ తాను తీసుకున్న పారితోషకం నుండి 5 కోట్లు వెనక్కి ఇచ్చేస్తున్నాడట. అలాగే దానయ్య మరో ఐదు కోట్లు అరెంజ్ చేస్తున్నాడట. అయితే ఇప్పుడు చిక్కల్లా.. బోయపాటి దగ్గర నుండి వచ్చిందట. ఇప్పటికే ప్రెస్ నోట్ విషయంలో కాస్త వేడి మీదున్న బోయపాటిని పారితోషకంలో సగం వెనక్కి ఇచ్చెయ్యమని నిర్మాత దానయ్య అడగడం… బోయపాటి మాత్రం ఏదో ఒకటీ అరా వెనక్కీ ఇస్తాను కానీ ఐదు కోట్లు అంటే కుదరదని అంటున్నాడట.

కుద‌ర‌దు అంటున్న బోయ‌పాటి

ఇక సినిమా ఫ్లాప్ విషయంలో రామ్ చరణ్ బోయపాటిపై అసంతృప్తితో ఉన్నాడు. ఇక ఇప్పుడు కొంత పారితోషకం వెనక్కి ఇవ్వమంటే.. కుదరదంటున్న బోయపాటి విషయంలో చరణ్ కూడా చిరాకు పడుతున్నాడట. మరోపక్క దానయ్య – బోయపాటి మధ్యలో మాటల యుద్ధం మొదలైందని… అంతా కలిసి బోయపాటి ని ఆడుకుంటున్నారని ఫిలింనగర్ టాక్. మొత్తం మీద హీరో – డైరెక్టర్ – ప్రొడ్యూసర్ వార్ అంటూ సోషల్ మీడియాలో ఎవరిష్టం వచ్చినట్లు వారు స్టోరీలు అల్లేస్తున్నారు.

Tags:    

Similar News