కిడ్నీలు ఆరోగ్యం ఉండాలంటే.. ఆహారంలో ఇవి తీసుకోండి

మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి. కిడ్నీల‌లో ఏదైనా స‌మ‌స్య‌ వ‌స్తే

Update: 2023-08-23 04:30 GMT

మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి. కిడ్నీల‌లో ఏదైనా స‌మ‌స్య‌ వ‌స్తే మీ మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను మూత్రం రూపంలో బయటకు పంపడమే కిడ్నీ పని. కిడ్నీ వ్యాధిని 'సైలెంట్ కిల్లర్' అని కూడా పిలుస్తారు.ఎందుకంటే చాలా మందికి ఆ వ్యాధులు తీవ్ర రూపం దాల్చే వరకు వాటి గురించి తెలియదు. చురుకైన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారం సహాయంతో కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డం చాలా వరకు సాధ్యమవుతుంది.

దీర్ఘకాలం పాటు కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆలివ్ ఆయిల్ ను ఆహారంలో తీసుకోవ‌డం వ‌ల్ల‌ చాలా ప్రయోజనం చేకూర్చుతుంది. ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి, ముఖ్యంగా మీ గుండెకు చాలా ఎఫెక్టివ్ ఆయిల్ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ నూనెలో అసంతృప్త కొవ్వు, విటమిన్ ఈ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి మీ కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది కాకుండా ఆలివ్ నూనెలో గణనీయమైన మొత్తంలో ఒలేయిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది మూత్రపిండాల వాపును తగ్గించడంలో ప్రభావవంతంగా ప‌నిచేస్తుంది.

అలాగే మీ ఆహారంలో సలాడ్స్ చేర్చండి. ఇవి చాలా ఆరోగ్యానికి చాలా మంచింది. దీర్ఘకాలం పాటు కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా వెల్లుల్లి, ఉల్లిపాయలను ఆహారంలో చేర్చుకోండి. ఈ రెండూ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటాయి. విటమిన్ బి6, మాంగనీస్, కాల్షియం వంటి పోషకాలు కూడా వీటిలో ఉంటాయి. వీటి వల్ల కిడ్నీ తన పనిని సక్రమంగా చేసుకోగలుగుతుంది.

మీరు కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవ‌డానికి ఆహార పదార్థాలలో క్రూసిఫరస్ కుటుంబానికి చెందిన కూరగాయలను తీసుకోవాలి. ఈ కూరగాయలలో క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ ఉన్నాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి.


Tags:    

Similar News