Vitamins Deficiency: మీ శరీరంలో విటమిన్ల లోపం ఉందా? వీటితో భర్తీ చేయవచ్చు!

ఈ రోజుల్లో ఎంతో మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకు కారణం జీవనశైలి. శరీరానికి సరైన పోషకాలు అందుతూ ప్రతి రోజు..

Update: 2023-12-24 13:15 GMT

Vitamins Deficiency

ఈ రోజుల్లో ఎంతో మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకు కారణం జీవనశైలి. శరీరానికి సరైన పోషకాలు అందుతూ ప్రతి రోజు వ్యాయమం ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మన శరీరానికి తగినంతగా విమిటన్స్‌ అందితే ఆరోగ్యంగా ఉంటాము. లేకుంటే సమస్యలు చుట్టుముడుతుంటాయి. విటమిన్ల లోపం వల్ల అనేక వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరంలో తగినంత విటమిన్లు ఉండటం వల్ల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అదే సమయంలో కొంతమంది విటమిన్ లోపాన్ని అధిగమించడానికి విటమిన్ సప్లిమెంట్లను తీసుకోవాలని సూచిస్తున్నారు. విటమిన్ లోపం కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని అనేక పరిశోధనలు కూడా వెల్లడించాయి.

ఏయే పండ్లలో విటమిన్స్‌ అధికంగా ఉంటాయి?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, శరీరంలో విటమిన్ల లోపం ఉంటే, వాటిని మందుల ద్వారా కాకుండా ఆహారం ద్వారా భర్తీ చేయడం మేలంటున్నారు. ఏ పండ్లు, కూరగాయలు ఏ విటమిన్లు అందిస్తాయో ప్రజలు తెలుసుకోవాలి. కానీ ఒక్కసారి శరీరంలో విటమిన్ల లోపం ఏర్పడితే ఆ లోపం భర్తీ అవుతుందా లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి. తరచుగా విటమిన్ లోపంతో బాధపడుతున్న వ్యక్తులు ప్రతి 6 నెలలకోసారి విటమిన్ స్థాయిలను తనిఖీ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వైద్య నిపుణుడు డాక్టర్ సందీప్ భట్నాగర్ విటమిన్ లోపాన్ని అధిగమించడం అస్సలు కష్టమైన పని కాదని చెబుతున్నారు. దీని కోసం మీరు మీ ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడమేనని అంటున్నారు. మీ ఆహారంలో గుడ్లు, చేపలు, పాలు, ఆకుపచ్చ కూరగాయలు, క్యాబేజీ, నిమ్మకాయ, వెన్న, కొబ్బరి నీరు, టొమాటో, సోయాబీన్ నూనె, వేరుశెనగ నూనెను చేర్చండి. ఇందులో పెద్ద పరిమాణంలో విటమిన్లు ఉంటాయి. అదే సమయంలో మీరు ఇప్పటికీ విటమిన్ లోపంతో బాధపడుతున్నట్లయితే, వైద్యుడిని సంప్రదించండి.

ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండండి..

విటమిన్ స్థాయిలను తనిఖీ చేస్తూ ఉండాలి. మీరు వైద్యుడిని సంప్రదించి, అతను సూచించిన ఔషధాన్ని తీసుకోవాలని డాక్టర్‌ సందీప్‌ భట్నాగర్‌ అంటున్నారు. తద్వారా విటమిన్ లోపం భర్తీ చేయబడుతుంది. ఫాస్ట్ ఫుడ్ మానేసి హోమ్ ఫుడ్ కు ప్రాధాన్యత ఇవ్వండి అంటున్నారు. మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పాలు, పెరుగు, వెన్న, గుడ్లు వంటి వాటిని చేర్చుకోండి. దీనితో పాటు, కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి. ప్రతిరోజూ సూర్యరశ్మి ఎంతో అవసరమని గమనించండి. తద్వారా విటమిన్ డి తగినంతగా లభిస్తుంది.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags:    

Similar News