మన ఆరోగ్యం బాగుండాలంటే అందుకు సరైన నిద్ర కూడా అవసరం. ప్రతి మనిషికి సరైన నిద్ర లేకుంటే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నిద్రలేమి కారణంగా శరీరంలో చాలా రకాల ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిద్ర అనేది మనిషి ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు తదితర విషయాలు నిద్రపై ప్రభావం చూపుతాయి. అయితే నిద్రపోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది. కానీ కొన్ని అలవాట్లను మెరుగుపరచడం ద్వారా తగినంత నిద్ర పడుతుంది. పిల్లలు ఎక్కువ నిద్రపోతే, వృద్ధులకు నిద్ర అస్సలు రాదు. అటువంటి పరిస్థితిలో ఏ వయస్సులో ఉన్న వ్యక్తి ఎన్ని గంటలు నిద్రపోవాలి అనే ప్రశ్న అందరి మదిలో తలెత్తుతుంది. అసలు ఎవరు ఎన్ని గంటలు పడుకోవాలి? అనేది అతని వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. మీ వయస్సు ప్రకారం.. మీకు తగినంత నిద్ర లేకపోతే, మీరు కూడా అనారోగ్యానికి గురవుతారు. అటువంటి పరిస్థితిలో మీరు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసుకోవడం ముఖ్యం.
నేషనల్ స్లీప్ ఫౌండేషన్ వివరాల ప్రకారం..
- 0 నుంచి 3 నెలల పిల్లలు 14 నుంచి 17 గంటల వరకు నిద్రపోవాలి.
- 4 నుంచి 12 నెలల పిల్లలు 12 నుంచి 16 గంటల వరకు నిద్రపోవాలి.
- 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలు 11 నుంచి 14 గంటలు నిద్రపోవాలి.
- 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు 10 నుంచి 13 గంటలు నిద్రపోవాలి.
- 6 నుంచి 9 సంవత్సరాల పిల్లలు 9 నుంచి 12 గంటలు నిద్రపోవాలి.
- 14 నుంచి 17 సంవత్సరాల పిల్లలకు రోజుకు 8-10 నిద్ర అవసరం. చివరికి యువత 7 నుంచి 9 గంటల నిద్రను పోవడం చాలా ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే 65 ఏళ్లు పైబడిన వారు రోజూ 7-8 గంటలు నిద్రపోవాలి.
మహిళలు ఎక్కువగా నిద్రపోవాలి
నేషనల్ స్లీప్ ఫౌండేషన్ పరిశోధన ప్రకారం.. టీనేజ్ అమ్మాయిలు 8 నుంచి 10 గంటల నిద్ర అవసరం. అదే సమయంలో 24 నుంచి 64 సంవత్సరాల వయస్సు గల స్త్రీలు రోజుకు ఏడు గంటలు నిద్రపోవాలి. పురుషుల కంటే మహిళలకు ఎక్కువ నిద్ర అవసరమని ఓ పరిశోధనలో తేలింది. ప్రతి స్త్రీ పురుషుడి కంటే 20 నిమిషాలు ఎక్కువ నిద్రపోవాలని సూచిస్తున్నారు నిపుణులు.