అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టే 'ఆలివ్ ఆయిల్'

ఆలివ్ నూనె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. విటమిన్-ఇ, ఐరన్, విటమిన్-కె, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్,

Update: 2023-08-19 13:09 GMT

ఆలివ్ నూనె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. విటమిన్-ఇ, ఐరన్, విటమిన్-కె, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇందులో ఉంటాయి. ఈ నూనెను ఆహారంలో వాడితే అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇది కాకుండా ఆలివ్ నూనెను చర్మానికి కూడా ఉపయోగిస్తారు. పోషకాలు అధికంగా ఉండే ఆలివ్ నూనెజీర్ణక్రియకు కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. కాబట్టి ఆలివ్ నూనె ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

సమృద్ధిగా యాంటీ ఆక్సిడెంట్లు..

ఆలివ్ నూనెలో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో విటమిన్-ఇ, విటమిన్-కె వంటి పోషకాలు లభిస్తాయి. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతాయి.

అల్జీమర్స్ ఉన్న‌వారికి..

ఆలివ్ ఆయిల్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్ సమస్య ఉన్నవారికి ఆలివ్ ఆయిల్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ అల్జీమర్స్ ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆలివ్ ఆయిల్ మీ జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

గుండెకు ఎంతో మేలు

ఆలివ్ ఆయిల్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఇందులో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. దీని కారణంగా రక్తపోటు స్థాయి కూడా సాధారణం అవుతంది. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు తప్పనిసరిగా ఆలివ్ నూనెను ఆహారంలో చేర్చుకోవాలి. ఈ నూనె గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది.

జీర్ణక్రియకు కూడా..

ఆలివ్ ఆయిల్ మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది ప్రేగుల‌ కదలికల‌ను సులభతరం చేస్తుంది.. తద్వారా మీరు మలబద్ధకం సమస్యను నివారించవచ్చు. ఆలివ్ ఆయిల్ ను రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకుంటే జీర్ణ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

బరువు తగ్గడంలో..

ఆలివ్ నూనెలో కేలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు మీ బరువు తగ్గించే ప్రయాణంలో ఈ నూనెను సంతోషంగా తీసుకోవ‌చ్చు.. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

ఎముకలకు మేలు..

ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి ఎముకల అభివృద్ధికి సహాయపడ‌తాయి. మీరు కీళ్ల‌ నొప్పితో బాధపడుతున్నట్లయితే.. ఖచ్చితంగా ఆలివ్ నూనెను వాడండి.. మీకు ఉపశమనం ల‌భిస్తుంది.


Tags:    

Similar News