Brain Health: మీ మెదడుకు చెడు చేసే ఆహారాలు

Update: 2024-01-24 07:15 GMT

Brain Health

Brain Health: మన శరీరంలో మెదుడు కీలక పాత్ర పోషిస్తుంది. మెదుడకు సంబంధించి ఏదైనా సమస్యలు తలెత్తితే తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంటుంది. అందుకే జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ చెడు అలవాట్లను దూరం చేసుకోవడం ముఖ్యం. ఇక ఆల్కహాల్ వినియోగం మెదడు నిర్మాణం, పనితీరును తీవ్రంగా దెబ్బతిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది వివిధ రకాల సమస్యలకు దారి తీస్తుందంటున్నారు.

ఫ్రైడ్ ఫుడ్స్: ఫ్రైడ్ ఫుడ్స్ లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇది వంట ప్రక్రియలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను విడుదల చేస్తుంది.

ప్రాసెస్ చేసిన మాంసం: ప్రాసెస్ చేసిన మాంసాన్ని తీసుకోవడం వల్ల మెదడులో వాపు వచ్చే ప్రమాదం ఉంది. దీని వల్ల మెదడు పనితీరులో తీవ్రమైన సమస్యలకు దారి తీయవచ్చు.

ప్రాసెస్ చేసిన ఆహారాలు: ప్రాసెస్ చేసిన ఆహారాలు కృత్రిమ సంరక్షణకారులను, అనారోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. ఇది మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది.

సోడియం అధికంగా ఉండే ఆహారాలు: అధిక ఉప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు వస్తుంది. ఇది మెదడుకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది.

చక్కెర పానీయాలు: సోడా, చక్కెర పానీయాలు మెదడు పనితీరులో క్షీణతకు దారితీస్తాయి.

కృత్రిమ స్వీటెనర్లు: కృత్రిమ స్వీటెనర్లను తీసుకోవడం వల్ల వ్యక్తి మెదుడు పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే ఆహారాలు తీసుకోవడంలో కూడా జాగ్రత్తలు వహించాలంటున్నారు నిపుణులు.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags:    

Similar News