ఒత్తిళ్లను జయించడం ఎలా...? సైకాలజీ నిపుణులు ఏమంటున్నారు..?

ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల సమస్యలతో బాధపడుతుంటారు. చిన్న వయసులోనే లేనిపోని టెన్షన్స్‌ పెట్టుకుని క్షణీకావేశానికి..

Update: 2023-08-15 10:18 GMT

ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల సమస్యలతో బాధపడుతుంటారు. చిన్న వయసులోనే లేనిపోని టెన్షన్స్‌ పెట్టుకుని క్షణీకావేశానికి గురవుతుటారు. ఇలాంటి సమయంలో ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. తమ విలువైన లైఫ్‌స్టైల్‌ను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇలాంటి లక్షణాలు యువతతో పాటు పెద్దల్లో కూడా కనిపిస్తుంటాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇతర ఒత్తిళ్లు, మానిసక ఒత్తిళ్ల కారణంగానో, లేదా పరీల్లో మంచి మార్కులు రాలేదనో, లేక పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామనే ఇలా రకరకాల కారణాల వల్ల ఆత్మహత్యలకు ఒడిగడుతుంటారు. చాలా మందిలో ఒత్తిడికి లోనవుతుంటారు. అయితే ఒత్తిళ్ల నుంచి గట్టేక్కాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

అధిక టెన్షన్‌కు ఆహారం

అధిక టెన్షన్‌కు గురయ్యే వారు సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు సైకాలాజీ నిపుణులు. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మెదడు చురుకుదనంలా మారి ఒత్తిడి దూరం అవుతుందని చెబుతున్నారు. బలమైన ఆహారం తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా మారి ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. శరీరం మొత్తం యాక్టివ్‌ అవుతుంది. విటమిన్స్‌, మినరల్స్‌, మంచి పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలంటున్నారు.

అతిగా ఆలోచించవద్దు: కొన్ని కొన్ని విషయాలను పదే పదే ఆలోచించడం మానుకోవడం మంచిదంటున్నారు. ఇలా ఆలోచించడం వల్ల అధిక ఒత్తిడికి గురై మరింత ఆందోళనకు గురయ్యే అవకాశం ఉందని, వరుసగా పనులు చేస్తుంటే ఒత్తిడికి గురవుతుంటారు. మధ్య మధ్యలో కాస్త విరామం తీసుకుంటూ ఉండాలంటున్నారు.

ఒత్తిడి పెంచుకోవడం:

అలాగే ఎక్కువగా ఇబ్బంది పెట్టే విషయాలను సైతం చూడడం, వినడం కాని చేయవద్దని, ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా మానసికంగా బాగా కుంగిపోతాము. దీంతో ఆనారోగ్య సమస్యలు దరి చేరుతాయి. ఇలా అధిక ఒత్తిడి పెరిగిపోవడం హెల్త్‌ సమస్యలు మరింతగా ఏర్పడే అవకాశం ఉందంటున్నారు.

ఈ విషయాలకు దూరంగా ఉండాలి

ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉండే సమయంలో వీలైనప్పుడు అందరితో కలిసిపోయేలా ఉండాలి. స్నేహితులతో మాట్లాడుతుండాలి. ఏవైనా సమస్యలుంటే వారితో షేర్‌ చేసుకుంటే కొంత కొంత ఒత్తిడి అనేది దూరమవుతుంది. చీకటిలో ఉండకుండా ఫ్రీగా ఉండటం అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా నిద్రలేమి సమస్య కూడా ఆరోగ్యానికి గురి చేస్తుంది. ఒత్తిడికి అనేక కారణాల్లో నిద్రలేమి. చాలా మంది రోజూకు నాలుగైదు గంటలు మాత్రమే పడుకుంటారు. మనం ప్రతి రోజు కనీసం ఆరు గంటలైన నిద్రించాలని నిపుణులు చెబుతున్నారు.

భారీ శ్రమతో కూడిన పనులు చేయవద్దు:

ఏ మాత్రం విశ్రాంతి లేకుండా పనులు చేయడం, అలాగే వివిధ పరిశ్రమల్లో పని చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. మంచి నిద్ర ఖచ్చితంగా అవసరం. అలాంటి సమయంలో సరిగ్గా నిద్రలేకపోతే అనేక అనారోగ్య సమస్యలు దరిచేరుతాయి. అంతేకాదు సమయానికి భోజనం చేయడం, సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటివి తప్పకుండా పాటిస్తే ఒత్తిడి నుంచి జయించవచ్చు.

Tags:    

Similar News