మీ పెదాలు పొడిబారుతున్నాయా? ఇలా చేయండి

చలికాలంలో పలు సమస్యలు వస్తుంటాయి. కాళ్లు, చేతులు పొడిబారినట్లుగా, అలాగే పెదాలు కూడా పొడిబారినట్లుగా..

Update: 2023-11-21 15:38 GMT

చలికాలంలో పలు సమస్యలు వస్తుంటాయి. కాళ్లు, చేతులు పొడిబారినట్లుగా, అలాగే పెదాలు కూడా పొడిబారినట్లుగా మారుతుంటాయి. ఈ సమస్య చాలా మందిలో ఎదురవుతుంటుంది. తేమను కోల్పోయిన పెదాలు నల్లగా, నిర్జీవంగా కనిపిస్తుంటాయి. ఈ చలికాలంలో ఆరోగ్య నిపుణుల సలహలు పాటించడం చాలా ముఖ్యం. చలి ఉష్ణోగ్రతలు, చీకటి రాత్రులతో శీతాకాలం దానికదే కఠినంగా ఉంటుంది. చర్మాన్ని పొడిబారేలా చేస్తుంది.

పెదాలు మృదువుగా కావాలంటే..

ఈ చలికాలంలో పెదాలు ఎర్రగా, మృదువుగా మారేందుకు తేనె అద్భతంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం టీస్పూన్ తేనెలో అరటీస్పూన్ దానిమ్మ రసం వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత బయటకు తీసి ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేయాలి. ఆ తర్వాత పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే పెదాలు అద్భుతంగా తయారవుతాయి.

పెదాలకు గులాబీ పువ్వు

పెదాలకు గులాబీ పువ్వు ఉపయోగకరంగా ఉంటుంది. గులాబీ రేకుల్లో విటమిన్‌ సి ఉంటుంది. ఇది మన చర్మానికి తేమను అందిస్తుంది. పావు కప్పు పాలల్లో కొన్ని గులాబీ రేకుల్ని వేసి చేత్తో నలుపుతూ మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇందులో టీస్పూన్ బాదం నూనె, టీస్పూన్ గ్లిజరిన్ కూడా వేసి బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పెదాలకు రాయాలి. ఈ మిశ్రమం ఆరిపోకుండా మళ్లీ మళ్లీ రాస్తుండాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేస్తే పెదాలు గులాబీ రంగును సంతరించుకుంటాయి.

గ్లిజరిన్‌

పెదాలు పొడిబారకుండా తేమను అందించేందుకు గ్లిజరిన్‌ ఉపయోగకరంగా ఉంటుంది. దీని వల్ల పెదాలు సున్నితత్వంలా మారుతాయి. ఇక నల్ల రంగు మారుతు, పొడిబారుతున్న పెదాలు తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి నిమ్మరసం అద్భుతంగా పని చేస్తుంది. అందుకే ఐదు టీస్పూన్ల నిమ్మరసంలో ఒక టీస్పూన్‌ గ్లిజరిన్ వేసి.. రోజూ పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడగడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

బీట్‌రూట్ రసం

పెదాలకు బీట్‌రూట్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు సలహాలు ఇస్తున్నారు. పెదాలు మృదువుగా మారాలంటే బీట్‌ రూట్‌ మంచి ప్రయోజనాన్ని ఇస్తుందని అంటున్నారు. గ్లిజరిన్, బీట్‌రూట్‌ ప్యాక్ వేసుకుంటే పెదాలు మెరిసిపోవడం ఖాయం. దీనికోసం బీట్‌రూట్‌ జ్యూస్‌ను ఒక రోజంతా ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. లేదా కాస్త వేడి చేసి చిక్కగా చేసుకోవాలి. ఇప్పుడు అందులో ముప్పావు టీస్పూన్ గ్లిజరిన్ వేసి ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసుకోవాలి. అరగంట పాటు అలాగే ఉంచుకుని తర్వాత చల్లని నీటితో కగడాలి. మంచి ఫలితం ఉంటుంది.

మీ పెదవులపై ఉన్న చర్మాన్ని తీయకుండా ఉండాలి. చేతులతో పెదల చర్మాన్ని లాగడం వల్ల పెదాలు దెబ్బతినే అవకాశం ఉంది. మీ పెదాలను లాగడం లేదా కొరకడం మానుకోండి. మీ పెదాలకు వ్యతిరేకంగా ఈ రాపిడి వాటిని మరింత దెబ్బతీస్తుంది. వాటిని మరింత పొడిగా చేస్తుంది. 

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

Tags:    

Similar News