ప్రతిరోజూ గుడ్డుతినడం ఆరోగ్యానికి మంచిదేనా ?

చాలామంది తమ డైట్ లో భాగంగా గుడ్లు(Eggs) ఎక్కువగా తీసుకుంటుంటారు. ప్రతిరోజూ గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదేనా ? రోజుకు..

Update: 2022-04-07 03:00 GMT

ప్రస్తుతం ఆరోగ్యం గురించి చెప్పుకోవాలంటే.. కరోనాకి ముందు కరోనా తర్వాత అని చెప్పాల్సిన పరిస్థితి. దేశంలో కరోనా మొదలైనప్పటి నుంచి ఇమ్యూనిటీని పెంచే ఆహారం తీసుకోవాలని వైద్య నిపుణులు సూచించిన నేపథ్యంలో.. అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితమైన డైట్ పాటించాల్సిందే. ప్రతి నిత్యం వ్యాయామాలు, ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరం ధృడంగా ఉంటుంది.

చాలామంది తమ డైట్ లో భాగంగా గుడ్లు(Eggs) ఎక్కువగా తీసుకుంటుంటారు. ప్రతిరోజూ గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదేనా ? రోజుకు ఎన్ని గుడ్లను తినాలి ? అధికంగా గుడ్లను తింటే వచ్చే సమస్యలు ఏంటి ? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.

గుడ్లలో ప్రొటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుండె నుంచి కళ్ల వరకూ అన్ని అవయవాలను కాపాడుతాయి. కానీ.. పరిమితికి మించి గుడ్లను తినడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్యులు. ఏ ఆహారమైనా అతిగా తీసుకుంటే హానికరమే కదా.
గుడ్లు ఎక్కువగా తినడం వల్ల అందులో ఉండే పచ్చసొన ద్వారా ఏర్పడే కొలెస్ట్రాల్ గుండెకు ప్రమాదకరంగా మారొచ్చు. అందుకే.. రోజుకు ఒకటి లేదా రెండు గుడ్ల కంటే ఎక్కువ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి కూడా పచ్చసొన తీసేసి.. తెల్లసొనను మాత్రమే తినడం ఇంకా మంచిది.
గుడ్లు ఎక్కువగా తినడం వల్ల వచ్చే వ్యాధులు
ప్రతిరోజూ పరిమితికి మించి గుడ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. గుడ్డులో ఉండే కొలెస్ట్రాలే ఇందుకు ప్రధాన కారణం. కొవ్వు శాతం అధికంగా ఉండే గుడ్లను అధిక మోతాదులో తినడం వల్ల మన శరీరంలో ఉండే ఇన్సులిన్ అస్థిరంగా మారుతుందని, ఫలితంగా షుగర్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.

అలాగే అధికంగా గుడ్లు తినడం వల్ల.. డైట్ మాట పక్కనపెడితే ఊబకాయం పెరిగే ప్రమాదం ఉంది. బరువు తగ్గేందుకు డైట్ లో భాగంగా తీసుకునే గుడ్లు.. మోతాదు పెరిగితే హాని తప్పదంటున్నారు. నిజానికి గుడ్డులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.. ఎక్కువ మోతాదులో గుడ్లు తినడం వల్ల శరీరంలో కేలరీల పరిమాణం పెరుగుతుంది. ఫలితంగా విపరీతంగా బరువు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి డైట్ లో గుడ్లను ఖచ్చితంగా తీసుకునేవారు.. రోజుకి రెండు గుడ్లు మాత్రమే తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అలాగే ప్రతిఒక్కరూ రోజుకి కనీసం ఒకగుడ్డునైనా తినాలని వైద్యుల సూచన. 



Tags:    

Similar News