Sleeping Tips: మీరు దిండు వేసుకుని నిద్రిస్తున్నారా? ఈ సమస్యలు రావచ్చు

కొన్ని రకాల జీవనశైలి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మనిషికి ముఖ్యంగా నిద్ర ఎంతో అవసరం

Update: 2023-11-13 16:24 GMT

కొన్ని రకాల జీవనశైలి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మనిషికి ముఖ్యంగా నిద్ర ఎంతో అవసరం. సరైన నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బందులు పడేవారు ఉన్నారు. అయితే నిద్రిస్తున్న సమయంలో చాలా మంది కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. ఎంతో మందికి మందపాటి దిండు వేసుకుని నిద్రించే అలవాటు ఉంటుంది. ఇది పూర్తిగా తప్పు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హెల్త్‌లైన్‌ కథనాల ప్రరకారం.. మందపాటి దిండుపై పడుకోవడం వల్ల కలిగే నష్టాలను తెలుసుకుందాం.

వెన్నెముక నొప్పి:

చాలా మంది రాత్రి నిద్రించేటప్పుడు తలకింద పెట్టుకునే దిండు మీ వెన్నెముక ప్రభావితం కావచ్చు. ఒక మందపాటి దిండుపై పడుకోవడం వల్ల మీ వెన్నెముకలో అనేక వంపులు ఏర్పడి దీని కారణంగా వెన్నునొప్పి కూడా ఇబ్బంది పెట్టవచ్చు. కొందరికి ఎన్నో మందులు వాడినా తగ్గని పరిస్థితులు కూడా ఉన్నాయి.

మెడనొప్పి:

రాత్రిపూట నిద్రించే ముందు మందపాటి లేదా రెండు దిండులు పెట్టుకోవడం వల్ల అనేక వ్యాధులకు కారణమని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మెడలో నొప్పి వస్తుంది. ఈ నొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి సరిపోతుంది. ఈ రకమైన నొప్పిని వదిలించుకోవడానికి, చిన్న పరిమాణంలో లేదా మృదువైన దిండును వర్తింపచేయడం మంచిది.

భుజం-చేతి నొప్పి:

చాలా మంది ఉదయం లేవగానే భుజం లేదా చేయి నొప్పి సమస్యలతో బాధపడవచ్చు. మందపాటి దిండుతో నిద్రించడం కారణంగా ఈ సమస్య రావచ్చని చెబుతున్నారు. దీని వల్ల భుజం వంపులోకి జారడం వల్ల నొప్పి వచ్చే ప్రమాదం ఉంది.

రక్త ప్రసరణకు ఆటంకం:

మీరు మందపాటి దిండుతో నిద్రిస్తే తలకు రక్తం చేరే ప్రక్రియకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. దీని వల్ల జుట్టుపై ప్రభావం పడవచ్చు. దీంతో జుట్టు రాలడం ప్రారంభమవుతుంది.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

Tags:    

Similar News