ఇలాంటి ఫుడ్‌ తీసుకుంటున్నారా? డేంజరే.. పరిశోధనలో షాకింగ్‌ నిజాలు

మన మెదడు 24 గంటలు పని చేస్తూనే ఉంటుంది. ఇది మన ఆలోచనలు, శ్వాస, హృదయ స్పందన, మొత్తం శరీరాన్ని జాగ్రత్తగా..

Update: 2023-10-03 06:25 GMT

మన మెదడు 24 గంటలు పని చేస్తూనే ఉంటుంది. ఇది మన ఆలోచనలు, శ్వాస, హృదయ స్పందన, మొత్తం శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. నిద్రలో కూడా కష్టపడి పనిచేస్తూనే ఉంటుంది మన మెదడు. దీని అర్థం మెదడుకు నిరంతరం ఇంధన సరఫరా అవసరం. అంటే సరైన ఆహారం అవసరం అన్నట్లు. మెదడుకు ఇంధనం అనేది మనం తినే ఆహార పదార్థాల నుండి వస్తుంది. ఈ ఆహారాలు మెదడుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. మనం తినేవి మెదడు నిర్మాణం, పనితీరు, మానసిక స్థితిని నేరుగా ప్రభావితం చేస్తాయి. ప్రాసెస్ చేయబడిన ఆహారాలు ఆందోళన, నిరాశ, క్షీణతతో ముడిపడి ఉన్నాయని అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అంటే ప్రాసెస్ చేసిన ఆహారాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.

అల్ట్రా-ప్రాసెస్ట్‌ ఫుడ్‌ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. మానసిక క్షీణత తీవ్రంగా తగ్గుతుంది. భారతదేశానికి చెందిన 30 వేలమందిపై మెగా గ్లోబల్‌ అధ్యయనం పరిశోధన నిర్వహించి పలు కీలక విషయాలను రాబట్టింది. ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాలు తక్కువగా తీసుకున్న వారి కంటే ఎక్కువగా తీసుకున్నవారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధకులు పరిశోధనల ద్వారా గుర్తించారు. అనారోగ్యం బారిన పడే వారు దాదాపు మూడు రేట్లు ఎక్కువగా ఉంటుందట. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది నుంచి వచ్చిన ప్రతి స్పందనలను విశ్లేషించారు పరిశోధకులు. వివరాలు Sapiens Labs సోమవారం నివేదికలో వెల్లడించింది. అల్ట్రా ప్రాసెస్‌ ఫుడ్‌ కోసం భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటి. ఈ రంగం 2011 నుంచి 2021 మధ్య కాలంలో రిటైల్‌ అమ్మకాల విలులో 13.37 శాతం వార్షిక వృద్ధి రేటుతో వృద్ది చెందందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గుర్తించింది. వచ్చే దశాబ్ద కాలంలో జీడీపీ వృద్ధి, అవసరమైన ఆహార పదార్థాల వినియోగం రెండింటి కంటే వేగంగా వృద్ధి చెందతాయని అంచనా వేస్తోంది.
గతంలో చేసిన అధ్యయనాలు ఊబకాయం మధుమేహం, గుండె జబ్బులువంటి ఆరోగ్య పరిస్థితులతో అల్ట్రా-ప్రాసెస్‌ ఫుడ్‌( యూపీఎఫ్‌)లను అనుసంధానించాయి. ప్రస్తుత అధ్యయనం 26 దేశాలలో విస్తరించింది. మానసిక ఆరోగ్య పారామితుల శ్రేణితో ఈ ఆహారాల లింక్‌లను బహిర్గతం చేయడం ద్వారా ఒక అడుగు ముందుకు వేసింది. ఈ ప్రాసెస్‌ చేసిన ఫుడ్‌ తీసుకోవడం వల్ల డిప్రెషన్‌కు మంచిన మానసిక పనితీరు క్షీణించడం కొనసాగుతుందని పరిశోధకులు గుర్తించారు. ప్రత్యేకించి ఆలోచన, భాగోద్వేగాలను నియంత్రించే సామర్థ్యాలను కోల్పోతారని నిపుణుడు త్యాగరాజన్‌ అన్నారు. ముఖ్యంగా 18-24 సంవత్సరాల వయసు గల యువకులలో వారు 45, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పెద్దలతో పోలిస్తే ప్రతి రోజు అలాంటి ఆహారం తీసుకునే అవకాశం రెండు రేట్లు ఎక్కువ అని ఆయన పేర్కొన్నారు.
Tags:    

Similar News