Sunlight: సూర్యరశ్మి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

Sunlight: శీతాకాలంలో చలినుంచి కాపాడుకోవడానికి చాలామంది బయటకు కూడా వెళ్లరు. ఒక వేళాల్సి వస్తే స్వెట్టర్లు, మంకీక్యాప్..

Update: 2023-12-30 11:30 GMT

Sunlight Benefits

Sunlight: శీతాకాలంలో చలినుంచి కాపాడుకోవడానికి చాలామంది బయటకు కూడా వెళ్లరు. ఒక వేళాల్సి వస్తే స్వెట్టర్లు, మంకీక్యాప్ పెట్టుకొని వెళ్తారు. ఎండ మాత్రం శరీరంపై పడనివ్వరు. సూర్యరశ్మిని దాదాపుగా నివారించే పరిస్థితికి చేరుకుంటున్నారు. కానీ సూర్యరశ్మి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతి ఒక్కరికి సూర్యరశ్మి తప్పకుండా అవసరం. ప్రతిరోజు కొంత సేపైనా ఎండలో ఉండటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మర ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

➦ విటమిన్ డి : శరీరంలో కాల్షియం శోషణకు విటమిన్ డి అవసరం అవుతుంది. ఇది లోపిస్తే ఎముకలు బలహీనంగా మారతాయి. ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. సూర్యరశ్మి నుంచి మన శరీరానికి విటమిన్ డి అధికంగా లభిస్తుంది.

➦ ఒత్తిడిని తగ్గిస్తుంది : సూర్యకాంతి శరీరంలో సంతోషకరమైన హార్మోన్లను విడుదల చేస్తుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది. దీన్ని తగ్గించడంలో సూర్యరశ్మి ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

➦ ఉదయం నిద్రలేవగానే : ఇక ప్రతి రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత కూడా మనం ఫ్రెష్ గా ఉండలేకపోతున్నాం. ఉదయాన్నే సూర్యకాంతిలో గడపడం వల్ల ఏవైనా అనాగ్య సమస్యలు ఏవైనా ఉంటే దూరమవుతాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరిచి రోజంతా హుషారుగా ఉండేలా చేస్తుంది.

➦ సరైన నిద్ర : సూర్యరశ్మి వల్ల సరైన నిద్ర ఉంటుంది. సూర్యరశ్మి వల్ల మీ కార్డియాక్ రిథమ్( నిద్ర-మేల్కొనే అలవాటు) మెరుగుపడుతుంది. రాత్రి సరైన నిద్ర ఉంటుంది. తర్వాతరోజు ఉదయం తాజా అనుభూతిని పొందుతారు.

➦ మెరుగైన మానసిక ఆరోగ్యం : ఉదయాన్నే సూర్యకాంతిలో కాసేపు ఉండడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. సీజన్ ఎఫెక్టివ్ డిజార్డర్ కు గురవరు. ఇది శరీరంలో హ్యాపీ హార్మోన్ సెరోటోనిన్‌ను విడుదల చేస్తుంది.

Tags:    

Similar News