మీకు మధుమేహం ఉందా...? ఈ కూరగాయలకు దూరంగా ఉండండి

మధుమేహం.. ఇది చాపకింద నీరులా ప్రపంచాన్ని మొత్తం చుట్టేస్తోంది. రానున్న రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్‌..

Update: 2023-08-10 05:14 GMT

మధుమేహం.. ఇది చాపకింద నీరులా ప్రపంచాన్ని మొత్తం చుట్టేస్తోంది. రానున్న రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్‌ మరింతగా విస్తరించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్యం సంస్థ (WHO) చెబుతోంది. ప్రతి ఒక్కరి జీవన శైలిలో మార్పుల కారణంగా మధుమేహం బారిన పడే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ చెబుతున్న మాట. అయితే మధుమేహం ఉన్నవారు ముఖ్యంగా ఆహార నియమాలలో మార్పులు చేసుకోవడం తప్పనిసరి. కొన్ని కూరగాయాలు ఎక్కువగా తీసుకుంటే మరికొన్ని కూరగాయాలకు దూరంగా ఉండటం మంచిదంటున్నారు నిపుణులు. డయాబెటిక్ రోగులుకొన్ని కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. మధుమేహం ఉన్నవారు జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ ముందుకు సాగడం తప్ప ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసుకోలేని పరిస్థితి.

బంగాళదుంపలకు దూరం ఉండండి: బంగాళదుంపల వినియోగం మధుమేహ రోగుల ఆరోగ్యానికి చాలా హానికరం. ఇందులో పిండి పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. అంటే బంగాళాదుంపలు చాలా కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయన్నట్లు. ఇది కాకుండా బంగాళదుంపలు అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. ఇది డయాబెటిస్‌ ఉన్నవారికి హానికరమని చెబుతున్నారు వైద్య నిపుణులు.

మొక్కజొన్న తినవద్దు: మొక్కజొన్న గ్లైసెమిక్ ఎక్కువగానే ఉంటుంది. దీని కారణంగా ఇది డయాబెటిక్ రోగులకు హాని కలిగిస్తుంది. ఒక వేళ దీనిని తీసుకుంటే ఫైబర్‌ అధికంగా ఉండే ఆహారంలో కలుపుకొని తీసుకుంటే మంచిదంటున్నారు.

బఠానీలు తినడం మానుకోండి: బఠానీలలో పిండి పదార్థాలు ఎక్కువగానే ఉంటాయట. అందుకే ఇది డయాబెటిక్ రోగులకు హాని కలిగిస్తుంది. మధుమేహం ఉన్నవారు వీటిని దూరంగా ఉండటం మంచిది.

కూరగాయల రసం తాగవద్దు: పచ్చి కూరగాయల రసం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, ఈ పానీయంలో ఫైబర్ లోపం చాలా ఉంది. అందుకే డయాబెటిక్ రోగులకు ఇది మంచిది కాదంటున్నారు నిపుణులు. ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. వెజిటబుల్ జ్యూస్ తాగే బదులు వాటిని డైట్ లో చేర్చుకుంటే మంచిది.

ఇలా డయాబెటిస్ ఉన్న వారు జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. లేకపోతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి డయాబెటిస్ వచ్చిందంటే చాలు జీవన శైలిలో పూర్తిగా మార్పులు చేసుకోవడం తప్పనిసరి. ఈ వ్యాధి ఉన్న వారు ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినట్లయితే శరీరంలోని ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. దీంతో హార్డ్ ఎటాక్, కిడ్నీలు పాడైపోవడం, లివర్ చెడివడంతో పాటు మరిన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించాలని మేము సలహ ఇస్తున్నాము.)

Tags:    

Similar News