హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది...?
హైదరాబాద్ బోయిగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక టింబర్ డిపోలో ఈ ప్రమాదం జరిగింది.;
హైదరాబాద్ బోయిగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక టింబర్ డిపోలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో 11 మంది కార్మికులు డిపోలో ఉన్నట్లు చెబుతున్నారు. వారిలో కొందరు మంటల్లో చిక్కుకుని ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టింబర్ డిపోలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.
చిక్కుకుపోయిన వారి కోసం....
ప్రమాద సమయంలో టింబర్ డిపోలో చిక్కుకుపోయిన 11 మంది కార్మికుల కోసం అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు. దాదాపు ఎనిమిది ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. డిపోలో చిక్కుకున్న ఒక కార్మికుడిని కాపాడారు. అయితే అతని పరస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.