Akkineni Nagarjuna In Court: వెనక్కు తగ్గని అక్కినేని నాగార్జున.. కోర్టులో చెప్పింది ఇదే!!

తన కుటుంబంపై కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై

Update: 2024-10-08 11:22 GMT

 Nagarjuna 

తన కుటుంబంపై కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున న్యాయ పోరాటం కూడా మొదలుపెట్టారు. స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హీరో నాగార్జున హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖ పై క్రిమినల్ కేసు దాఖలు చేయాలంటూ నాగార్జున కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీఎన్ఎస్ 356 యాక్ట్ కింద పిటిషన్ కూడా దాఖలు చేశారు.

పిటిషనర్ స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత కోర్టు ప్రతివాదులకు సమన్లు జారీ చేయనుంది. హీరో నాగార్జున తో పాటు నాగచైతన్య, అమల, సుప్రియలు కూడా కోర్టుకు వచ్చారు. మంత్రి కొండా సురేఖ వాఖ్యల కారణంగా మా కుటుంబానికి భారీ డ్యామేజ్ జరిగింది.
మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. మంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు. మా సినీ రంగం మీద రాజకీయాలు చేయడం ఆమోదించమన్నారు. BNS యాక్ట్ 356 ప్రకారం మంత్రి పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోరారు. నాగార్జున పిటిషన్ లో కోర్టు సాక్షి సుప్రియ స్టేట్ మెంట్ నమోదు చేసింది. తమ కుటుంబం తీవ్ర మానసిక క్షోభకు గురైందన్నారు.

కొండా సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ నాగార్జున ధర్మాసనాన్ని కోరారు. దేశ వ్యాప్తంగా ఎంతో మంది మా కుటుంబం పట్ల ప్రజలు ఆధారాభిమానాలు చూపిస్తున్నారు. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి. సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నాం. మా కొడుకు విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ వల్లే అంటూ మంత్రి అసభ్యంగా మాట్లాడారని తెలిపారు. అలా మాట్లాడం వలన మా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని, మంత్రి కొండా సురేఖ ఫై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున డిమాండ్ చేశారు.
Tags:    

Similar News