బౌన్సర్లకు సీవీ ఆనంద్ వార్నింగ్.. పబ్లిక్ జోలికి వస్తే తాట తీస్తాం
సెలబ్రిటీల బౌన్సర్లకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు
సెలబ్రిటీల బౌన్సర్లకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు. సంథ్య థియేటర్ లో జరిగిన సంఘటనపై ఆయన స్పందించారు. బౌన్సర్ల వ్యవహార శైలికి ఆ సెలబ్రిటీలు, వీఐపీలే బాధ్యత వహించాలన్నారు. పబ్లిక్ ను తోసేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. థియేటర్ గేట్లను కూడా బౌన్సర్లు తీసివేస్తున్నారన్నారు. ప్రజలను, పోలీసులను కూడా బౌన్సర్లే నెట్టి వేస్తున్నారని సీవీ ఆనంద్ తెలిపారు. బౌన్సర్లు తమ పరిధి దాటి వ్యవహరిస్తే తాట తీస్తామని సీవీ ఆనంద్ హెచ్చరించారు.
థియేటర్లు గేటు తీయడం, వేయడం...
బౌన్సర్లు థియేటర్ గేటు తీయడం, వేయడం ఎందుకంటూ సీవీ ఆనంద్ ప్రశ్నించారు. బౌన్సర్లకు ఏజెన్సీయే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. రేవతి చనిపోవడానికి బౌన్సర్ల అత్యుత్సాహం కూడా కారణమని సీవీ ఆనంద్ తెలిపారు. సంథ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాటపై ఆయన కొన్ని నిమిషాల వీడియోను విడుదల చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసులు వద్దని చెప్పినా అల్లు అర్జున్ వినిపించుకోకుండా రోడ్ షో చేశారని సీవీ ఆనంద్ తెలిపారు. బౌన్సర్లు తమ పరిధిని దాటి వ్యవహరించాలని సీవీ ఆనంద్ తెలిపారు. థియేటర్ నుంచి వెళ్లమని ఏసీపీ చెప్పినా అల్లు అర్జున్ వాదించారని సీపీ ఆనంద్ తెలిపారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now