హైదరాబాదీలను అలరించడానికి సిద్ధమైన 'పాజ్ అండ్ రిఫ్లెక్ట్' ఆర్ట్ ఎగ్జిబిషన్
హైదరాబాదీలను అలరించడానికి ఆర్ట్ ఎగ్జిబిషన్ పాజ్ అండ్ రిఫ్లెక్ట్ సిద్ధమైంది;
హైదరాబాదీలను అలరించడానికి ఆర్ట్ ఎగ్జిబిషన్ 'పాజ్ అండ్ రిఫ్లెక్ట్' సిద్ధమైంది. సెప్టెంబర్ 1 నుంచి 8 వ తేదీ వరకు స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్, కావూరి హిల్స్, మాదాపూర్ లో ఈ ఎగ్జిబిషన్ ను నిర్వహించనున్నారు. ఢిల్లీ ఆర్ట్ మాగ్నమ్ ఆధ్వర్యంలో ప్రముఖ ఆర్ట్ క్యూరియేటర్ అన్నపూర్ణ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ను నిర్వహించనున్నారు. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ లోనలుగురు విభిన్న కళాకారులు ధ్రువ్ పటేల్, దుష్యంత్, రఘు, ముఖ్తార్ అహ్మద్‌ల కళాఖండాలను ప్రదర్శించనున్నారు. యాంత్రిక జీవనంలో జీవితాన్ని ఆస్వాదించడం చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఎలా ఆనందంగా గడపాలో ప్రత్యేకంగా తమ కళాఖండాల ద్వార ప్రదర్శించనున్నారు. ప్రస్తుత ఉరుకుల, పరుగుల జీవితంలో ఒక నిమిషం ఆగి ఆ క్షణాన్ని ఆస్వాదించడమే మరిచిపోతున్న సందర్భంలో ఈ నలుగురు కళాకారుల విభిన్న ఆర్ట్స్ ప్రజలకు ఆనందాన్ని, ఆలోచనను కలిగిస్తాయి.
ఆర్టిస్ట్ రఘు తనదైన శైలితో మనకు కొత్త లోకాన్ని పరిచయం చేస్తారు. అందమైన జీవితాన్ని, ఒకరకమైన స్వచ్ఛతను చూపరులకు కళ్లకు కట్టినట్లు చూపిస్తారు. అలాగే ఆర్టిస్ట్ ముఖ్తార్ అహ్మద్ వర్షం, ధూళి కారణంగా పాడుపడ్డ భవనాల ద్వారా తన కథలు తెలియజేస్తారు. ధృవ్ పటేల్ కళ కూడా చాలా ప్రత్యేకమైనది. లంగూర్లు మానవ లక్షణాలను ప్రతిబింబిస్తాయి. వాటిని చూడగానే అందరి ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుంది. ఆర్టిస్ట్ దుష్యంత్ ఆర్ట్ లో ఎప్పుడూ మనకు తెలిసిన వస్తువులే కనిపిస్తాయి. వాటిని పిల్లల ఆటల్లో ఉన్నట్లు జంతువులతో జత చేస్తారు. అతని వాటర్ కలర్స్ వీక్షకులను బాగా ఆకర్షిస్తాయి. ఈ ఆర్టిస్టులు అంతా కలిసి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొత్తగా పరిచయం చేస్తారు. ఈ ప్రదర్శన కేవలం కళ ప్రదర్శన మాత్రమే కాదు, అందరినీ ఒక అడుగు వెనక్కి తీసుకుని, జీవితంలో సాధారణ ఆనందాలను ఆస్వాదించేలా ప్రేరేపిస్తుంది.
2024 సెప్టెంబర్ 1న, ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుంది. మాదాపూర్ లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ లో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు, ఉదయం 11 నుంచి రాత్రి 8 వరకు ఉంటుంది.