నేడు హైదరాబాద్‌కు జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ రానున్నారు. వైఎస్ షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు హాజరు కానున్నారు;
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ రానున్నారు. వైఎస్ షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు హాజరు కానున్నారు. సాయంత్రం 6.15 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. రాజారెడ్డి, ప్రియా నిశ్చితార్థ వేడుకలలో పాల్గొటారు. అనంతరం అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. జగన్ తో పాటు ఆయన సతీమణి భారతీ రెడ్డి కూడా హైదరాబాద్ రానున్నారు
షర్మిల కుమారుడు నిశ్చితార్ధానికి...
వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్ధం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో జరగనుంది. ఇద్దరి వివాహం ఫిబ్రవరి 17వ తేదీన జరగనుంది. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల అధినేతలు, సమీప బంధువులు పాల్గొంటారు. వైఎస్ జగన్ తో పాటు ఏపీ, తెలంగాణ రాజకీయ పార్టీల రాజకీయ నేతలు కూడా పొల్గొననున్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమితులు కావడంతో ఏపీ నుంచి పెద్దయెత్తున కాంగ్రెస్ నేతలు కూడా హాజరయ్యే అవకాశముంది.