Gold Rates Today : పసిడిప్రియులకు కాసింత ఊరట... ధరలు తగ్గి రారమ్మంటూ పిలుస్తున్నాయిగా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది;

Update: 2025-01-15 03:20 GMT

బంగారం అంటేనే ధరలు ఎక్కువ అనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే బంగారానికి ఉన్న డిమాండ్ అలాంటిది. బంగారం కొనుగోళ్లకు, వాటి ధరలకు అస్సలు సంబంధం ఏమాత్రం లేదు. వాటంతట అవే పెరుగుతుంటాయి. తగ్గుతుంటాయి. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు వంటి కారణాలు బంగారం ధరల్లో హెచ్చు తగ్గుదలకు ప్రధాన కారణాలుగా మారతాయని చెబుతుంటారు వ్యాపారులు. ఈ ఏడాది సంవత్సరం ప్రారంభం రోజు నుంచి ధరలు షాకిస్తున్నాయి. పెరగడమే తప్ప తగ్గడం అనేది అస్సలు జరగడం లేదు. ఎందుకంటే బంగారానికి ఉన్న డిమాండ్ అలాంటిది అని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు.

దక్షిణ భారతంలోనే...
ప్రధానంగా సౌత్ ఇండియాలో బంగారు ఆభరణాల కొనుగోలు ఎక్కువగా ఉంటుంది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం కొనుగోళ్లు మరింత ఎక్కువగా ఉంటాయి. ఉత్తర భారత దేశంతో పోల్చుకుంటే దక్షిణ భారత దేశంలోనే ఎక్కువ కొనుగోళ్లు అని వ్యాపారాలు ఇక్కడే చేస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. బంగారం ధరలతో నిమిత్తం లేకుండా కొనుగోలు చేసేది కూడా ఈ ప్రాంతంలోనే కావడంతో ఎక్కువ కార్పొరేట్ సంస్థలు ఇక్కడే తమ శాఖలను తెరుస్తున్నాయి. అంతేకాదు కొత్త కొత్త డిజైన్లతో ఎప్పటికప్పుడు మహిళలను ఆకట్టుకునేందుకు పోటీపడుతున్నాయి. మరోవైపు అదే సమయంలో రాయితీలు, డిస్కౌంట్లు కూడా ప్రకటిస్తూ కొంత ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
తగ్గిన ధరలు...
అయితే గత కొంత కాలంగా పెరుగుతున్న ధరలతో బంగారాన్ని కొనుగోలు చేయడానికి పేద, మధ్య తరగతి ప్రజలు ముందుకు రావడం లేదు. కేవలం కొన్ని వర్గాలు మాత్రమే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పెట్టుబడిగా భావించే వారు సయితం బంగారం, వెండి కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,290 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,950 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 99,900 రూపాయల వద్ద కొనసాగుతుంది.


Tags:    

Similar News