Gold Price Today : భోగి పండగ రోజు మహిళలకు గుడ్ న్యూస్ దిగివచ్చిన బంగారం ధరలు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది;
బంగారం అంటే మహిళలకు మహా పిచ్చి. ఎంతలా అంటే బంగారం కొనుగోలు చేసే ముందు రోజు రాత్రి వారికి నిద్ర కూడా పట్టదు. బంగారు ఆభరణాలను చూసి తమ సొంతం చేసుకునేవరకూ నిద్రపోరు. అంతగా ప్రేమిస్తారు పసిడిని. అందుకే ఏవస్తువు కొనుగోలు విషయంలోనూ వారు దుకాణాలకు రావడానికి ఆసక్తి కనపర్చరు. కానీ బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసే సమయంలో మాత్రం ఖచ్చితంగా షాపులకు మహిళలే ఎక్కువ వస్తారు. వారే దగ్గరుండి తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ధరలు కాస్తా అటూ ఇటూ అయినా పెద్దగా ఆలోచించరు. బంగారాన్ని సొంతం చేసుకుని ఇంటికి తీసుకెళ్లేందుకే ఎక్కువ ఉత్సాహం చూపుతారు.
ఆనందం అంతా ఇంతా కాదు...
అయితే బంగారం ధరలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. ఎన్నడూ లేనంతగా ధరలు అందుబాటులో లేకుండా పోతుండటంతో మహిళలు ఒకింత ఆందోళన, ఆవేదనకు గురవుతున్నారు. బంగారం ధరలు తగ్గినప్పుడు తక్కువగానూ, పెరిగినప్పుడు భారీగానూ పెరుగుదల కనిపించడం మామూలుగా జరిగే విషయమే. అయినా సరే ధరలు తగ్గాయంటే చాలు బంగారం సొంత మయినంత ఆనంద పడతారు. ప్రధానంగా దక్షిణ భారత దేశంలో మహిళలు అత్యంతగా ఇష్టపడి కొనుగోలు చేసే బంగారు ఆభరణాల విషయంలోనూ అదే జరుగుతుంది. విదేశాల్లో మాదిరిగా ఇక్కడ గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేసే అలవాటు లేదు. కేవలం ఆభరణాలను మాత్రమే సొంతం చేసుకుంటారు.
నేటి ధరలు...
దీంతోపాటు వెండి వస్తువులన్నా మరీ క్రేజ్. బంగారం, వెండి వస్తువులను స్టేటస్ సింబల్ గా చూడటం ప్రారంభమయిన తర్వాత నుంచే వీటికి డిమాండ్ అధికమై ధరలు కూడా పెరుగుతున్నాయి. అదే సయమంలో ధరలు తగ్గినప్పుడు మరింత ఆనంద పడి జ్యుయలరీ దుకాణాలకు పరుగులు తీస్తుంటారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. ఉదయం ఆరు గంటల వరకూ హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,990 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,630 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1, 00, 900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.