Hyderabad : హైదరాబాద్ లో నెల రోజులు ఆంక్షలు

హైదరాబాద్ లో నెల రోజుల పాటు ఆంక్షలు విధిస్తూ నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.;

Update: 2024-10-28 03:20 GMT
cv anand, hyderabad city police commissioner, warning,  bouncers
  • whatsapp icon

హైదరాబాద్ లో నెల రోజుల పాటు ఆంక్షలు విధిస్తూ నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదని ఆయన తెలిపారు. నగరమంతా 144వ సెక్షన్ విధించనున్నామని తెలిపారు. అనుమతి లేకుండా ర్యాలీలు, ఆందోళనలు, ప్రదర్శనలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమయన హెచ్చరించారు.

నెల రోజుల పాటు...
నెల రోజుల పాటు హైదరాబాద్ లో ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. రాజకీయ పార్టీలు కానీ ఇతరులు కానీ ఎటువంటి ఆందోళనలు చేయడానికి వీలు లేదని తెలిపారు. 144వ సెక్షన్ అమలులో ఉంటుందని, దీనిని గమనించి అందరూ నడుచుకోవాలని ఆయన సూచించారు.


Tags:    

Similar News