అర్థరాత్రి భారీ వర్షం.. నీట మునగిన కాలనీలు

హైదరాబాద్ లో అర్థరాత్రి భారీ వర్షానికి అనేక కాలనీలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి

Update: 2022-07-26 03:27 GMT

హైదరాబాద్ లో అర్థరాత్రి భారీ వర్షానికి అనేక కాలనీలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో నిన్న రాత్రి 12 గంటల తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో కోఠి, అబిడ్స్, నాంపల్లి, ఎల్బీనగర్, హయత్ నగర్, దిల్‌షుక్ నగర్, సరూర్ నగర్, రాయదుర్గం, కుషాయగూడ, మలక్ పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హిమాయత్ నగర్, నారాయణగూడల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారి కురిసిన వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి.

రాకపోకలకు అంతరాయం....
అనేక చోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మలక్ పేట్ వద్ద ట్రాఫిక్ చాలాసేపు స్థంభించిందని పోలీసులు చెబుతున్నారు. చింతల్ కుంట వద్ద జాతీయ రహదారిపైకి కూడా నీరు ప్రవహించింది. ఇక లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అనేక కాలనీలు నీటమునిగిపోవడతో ప్రజలు అర్ధరాత్రి నుంచి నీటిని బయటకు పంపేందుకు నానా కష్టాలు పడ్డారు. అకస్మాత్తుగా కురిసిన వర్షాలకు హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.


Tags:    

Similar News