Ys Sharmila : వైఎస్ తో తన అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు: షర్మిల
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల సమావేశమయ్యారు.;
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. గంటకు పైగా హైదరాబాద్ లోని ఆయన నివాసంలో చంద్రబాబుతో చర్చించారు. ఆ తర్వాత వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. ఎక్కువగా తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడుకున్నామని తెలిపారు. రాజకీయాలు మాట్లాడుకోలేదని తెలిపారు. తాను, వైఎస్ కాంగ్రెస్ నుంచి కలసి చేసిన ప్రయాణంతో పాటు, ఆయనతో ఉన్న రాజకీయ అనుబంధం గురించి చంద్రబాబు గుర్తు చేసుకున్నారన్నారు.
అందరికీ కేక్ పంపా...
రాజకీయాలు వృత్తి అని, పార్టీ నేతలందరికీ తాను క్రిస్మస్ రోజు కేక్ పంపామని, చంద్రబాబు కు పంపడంలో ప్రత్యేకత ఏమీ లేదని వైఎస్ షర్మిల తెలిపారు. కేటీఆర్, కవిత, హరీశ్‌రావులకు కూడా కేక్ పంపానని ఆమె చెప్పారు. చంద్రబాబును తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించడానికి మాత్రమే వెళ్లానని, రాజకీయాలు మాట్లాడుకోలేదని ఆయన అన్నారు. వైఎస్సార్ గురించి మాత్రమే చంద్రబాబు ప్రస్తావించారన్నారు. ఇది వింత కాదు.. విచిత్రం కాదని షర్మిల అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా తాను చేస్తానని ఆయన తెలిపారు.