Hyderabad : హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాాలను కూల్చివేత ప్రారంభమయింది. శనివారం కావడంతో ఈరోజు ఉదయం నుంచి ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు

Update: 2024-09-21 06:14 GMT

demolition illegal constructions, kokapet

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాాలను కూల్చివేత ప్రారంభమయింది. శనివారం కావడంతో ఈరోజు ఉదయం నుంచి ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఆక్రమణల తొలగింపునకు భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

కోకాపేటలో...
హైదరాబాద్ లోని కోకాపేటలో అక్రమ నిర్మాణాల కూల్చివేత జరుగుతుంది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన అక్రమార్కులు కొందరు సర్వే నెంబర్ 141లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. కూల్చివేతను అక్కడ నివాసముంటున్న వారు అడ్డుకుంటుండటంతో పోలీసులు వారిలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. భారీ బందోబస్తు మధ్య జేసీబీలతో కూల్చివేతలు కొనసాగుతున్నాయి.


Tags:    

Similar News