Khajaguda Hills:ఆ టైమ్ లో ఖాజాగూడ హిల్స్ లోకి నో ఎంట్రీ!!

అక్కడకు వెళ్లడంపై అధికారులు ఆంక్షలు విధించారు;

Update: 2024-02-28 06:46 GMT

Khajaguda Hills:ఖాజాగూడ హిల్స్.. ఒకప్పుడు రాత్రిపూట సమావేశాలు, కేరింతలకు కేంద్రంగా ఉండేది. అయితే కొందరి కారణంగా అక్కడకు వెళ్లడంపై అధికారులు ఆంక్షలు విధించారు. సాయంత్రం విశ్రాంతి కోరుకునే యువతకు ఇది ప్రసిద్ధ హాట్‌స్పాట్ గా ఉండేది. అయితే ఇక్కడకు వచ్చిన వ్యక్తులు ఆ సమయాల్లో చేసిన వికృత ప్రవర్తన, పర్యావరణాన్ని పాడుచేయడంతో ఆందోళనలు నెలకొన్నాయి. అందుకే సాయంత్రం తర్వాత ఎవరినీ పంపించకూడదని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

రాత్రిపూట వినోదం కోసం వెళ్లే స్థానిక యువకుల దుష్ప్రవర్తన గురించి ఎన్నో ఫిర్యాదులు అందాయని పోలీసులు గతంలోనే తెలిపారు. పర్యావరణానికి ఊహించని విధంగా జరుగుతున్న నష్టం కారణంగా అక్కడి పరిస్థితులు కూడా మారిపోయాయి. మద్యపానం, విందులు, చెత్తాచెదారంతో ఆ ప్రాంతాన్ని నింపివేస్తూ ఉండడంతో ప్రవేశాన్ని పరిమితం చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఒకప్పుడు 24/7 తెరిచి ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు సాయంత్రం 6 గంటల తర్వాత అనుమతి ఇవ్వడం లేదు. ఈ ప్రాంత పవిత్రతను కాపాడాల్సిన అవసరాన్ని గుర్తించి అధికారులకు ఫిర్యాదులు అందడంతో.. సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు.
రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ దాదాపు నెల రోజుల క్రితమే ఆంక్షలు విధించామన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత, సందర్శకుల ప్రవేశం పరిమితం చేశామన్నారు. కంచె కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఖాజాగూడ కొండలు పురాతన రాతి నిర్మాణాల కారణంగా భౌగోళిక, సాంస్కృతికంగా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇవి 2.5 బిలియన్ సంవత్సరాల నాటివని నిపుణులు తెలిపారు.


Tags:    

Similar News