Hyderabad: దివాళీ సందర్భంగా హైదరాబాద్‌ పోలీసులు కీలక ఆదేశాలు

దీపావళి అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. ఆనందోత్సవాల మధ్య పండగను..;

Update: 2023-11-11 02:11 GMT
Hyderabad, Diwali festival, Hyderabad City Police Commissioner, Diwali festival Orders
  • whatsapp icon

Diwali Festival: దీపావళి అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. ఆనందోత్సవాల మధ్య పండగను నిర్వహించుకుంటారు. రకరకాల బాణా సంచాలను కాలుస్తుండటంతో కాలుష్యంతో పాటు ధ్వని కూడా విపరీతంగా పెరిగిపోతుంటుంది. ఈ నేపథ్యంలో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొన్ని కీలక సూచనలు జారీ చేశారు. శాంతి భద్రతలతో పాటూ నగర ప్రజలకు ప్రశాంతతను కల్పించాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టంలోని సెక్షన్ 67(సి) కింద తన విధులను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బహిరంగ రహదారులతో పాటూ బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడం నిషేధించినట్లు పోలీసు కమిషనర్‌ సందీప్ శాండిల్య వెల్లడించారు.

సుప్రీం కోర్టు ఆదేశాలతోనే..

ఇటీవల సుప్రీం కోర్ట్ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఈ నిబంధనలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని బహిరంగ రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో పెద్ద శబ్దాలతో కూడిన బాణా సంచా పేల్చడం పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. దీపావళి సందర్భంగా రాత్రి 08:00 నుండి 10:00 గంటల మధ్య క్రాకర్స్, డ్రమ్స్, వాయిద్యాలకు అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించిన ధ్వని తీవ్రతకు మించి పెద్ద పెద్ద శబ్ధాలు చేయకూడదని వివరించారు.

ఈ ఆంక్షలు నవంబర్ 12వ తేది ఉదయం 06:00 గంటల నుంచి నవంబర్ 15వ తేది ఉదయం 06:00 గంటల వరకు అమలులో ఉంటాయని తెలిపారు. ఈ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం ప్రాసిక్యూషన్‌కు బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రజలకు హెచ్చరించారు. 

Tags:    

Similar News