బేబీ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ సీపీ
సినిమాపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ సినిమాలోని పలు;
బేబీ సినిమా థియేట్రికల్ రన్ పూర్తీ చేసుకుని.. ఓటీటీలో కూడా సందడి చేస్తూ ఉంది. అలాంటి సినిమాపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ సినిమాలోని పలు సీన్లపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బేబీ సినిమాలో డ్రగ్స్‌ను ప్రోత్సహించేలా సన్నివేశాలున్నాయని సీరియస్ అయ్యారు. తాము గతంలో ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్‍లో రైడ్ చేసిన సన్నివేశాల్లాగానే ఈ సినిమాలో కూడా సన్నివేశాలున్నాయని సీపీ తెలిపారు. బేబీ మూవీ బృందానికి నోటీసులు జారీ చేయనున్నట్టు సీవీ ఆనంద్ తెలిపారు. ఇక నుంచి ప్రతి సినిమాపై పోలీసుల నిఘా ఉంటుందని తెలిపారు.బేబీ సినిమాలో పలు సన్నివేశాల్లో హీరోయిన్ స్నేహితులు జాయింట్స్ కొడుతుండటం,డ్రగ్స్ వాడుతున్నట్టుగా చూపించారు. ఈ సన్నివేశాలు యూత్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని సీపీ అభిప్రాయపడ్డారు. ఇలాంటివి తీసే ముందు సమాజంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఆలోచించాలని సీపీ సీవీ ఆనంద్ సూచించారు.