హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక సూచనలు చేశారు. హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని.. 31న రాత్రి ఒంటి గంట వరకే వేడుకలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. 31న న్యూ ఇయర్‌కు స్పెషల్ ఈవెంట్లు పెట్టే పబ్‌లు, రెస్టారెంట్లు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలని.. ప్రతీ ఈవెంట్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరి ఉండాలని అన్నారు. డ్రగ్స్, గంజాయి రవాణపై ప్రత్యేక నిఘా ఉంటుందని అనుమతి లేకుండా లిక్కర్ సరఫరా చేయకూడదన్నారు.
తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికితే, 10వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామన్నారు. అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని అన్నారు. అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని.. 45 డెసిబుల్స్ శబ్దం కంటే ఎక్కువ శబ్ధం ఉండకూడదని అన్నారు. కెపాసిటీ మించి పాసులు ఇవ్వొద్దని నిర్వాహకులకు సూచించారు. పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలిపారు. సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య కల్పించొద్దని.. లిక్కర్ ఈవెంట్స్ లో మైనర్లకు అనుమతి లేదన్నారు. ఈవెంట్ల దగ్గర సెక్యూరిటీ, ట్రాఫిక్ గార్డులు ఉండాలని చెప్పారు. పబ్బుల్లో డ్యాన్సర్లతో కార్యక్రమాలపై నిషేధం ఉందని, కెపాసిటీకి మించి పాస్‌లు జారీ చేయవద్దని ఆదేశించారు.