Hyderabad Police: 21.55 లక్షలు అందించిన హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ క్రిమినల్స్ నుండి డబ్బును
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ క్రిమినల్స్ నుండి డబ్బును వసూలు చేశారు. సైబర్ మోసగాళ్ల మాయమాటలు నమ్మి ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితులకు డబ్బులు అందజేశారు. రెండు వేర్వేరు కేసుల్లో బాధితులకు రూ.21.55 లక్షలు వెనక్కు ఇచ్చారు.
హైదరాబాద్‌కు చెందిన 67 ఏళ్ల రిటైర్డ్ వ్యక్తి మోసపోయానంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ మోసగాళ్లు నకిలీ ట్రాయ్, సీబీఐ అధికారులమని చెబుతూ రూ.8.05 లక్షల మొత్తాన్ని బ్యాంకు ఖాతాల నుండి లాగేసుకున్నారు. నువామా సెక్యూరిటీస్‌లో పెట్టుబడులు పెడతామని, భారీగా లాభాలు ఇప్పిస్తామంటూ మోసం చేసి రూ.13.50 లక్షలను బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారని హైదరాబాద్‌కు చెందిన 56 ఏళ్ల వ్యక్తి నుంచి పోలీసులకు మరో ఫిర్యాదు అందింది.
పోలీసులు కేసులు నమోదు చేసి, ఆ మొత్తాన్ని స్తంభింపజేయాలని బ్యాంకు అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఆ డబ్బులు వెనక్కు తెచ్చుకోవడం కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫిర్యాదుదారుల బ్యాంకు ఖాతాకు రూ.21.55 లక్షల మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కోర్టు నుండి పోలీసులకు ఆదేశాలు వచ్చాయి. దీంతో హైదరాబాద్ పోలీసులు బాధితులకు డబ్బును అందజేశారు. అనధికార, మీకు తెలియని ప్లాట్‌ఫారమ్‌లను నమ్మవద్దని, తక్కువ సమయంలో భారీ రాబడిని ఇప్పిస్తామని చెబుతూ చాలా మంది మోసాలకు పాల్పడుతూ ఉంటారని, అసలు నమ్మకండని పోలీసులు సూచించారు. పోలీసులు, సిబిఐ, ఆర్‌బిఐ, ఇడి, కస్టమ్స్, జడ్జీలు, సైబర్ క్రైమ్స్, నార్కోటిక్స్ మొదలైన విభాగాల నుండి కొందరు కాల్స్, వీడియో కాల్స్ చేస్తారని, అలాంటి సమయాల్లో భయపడవద్దని పోలీసులు సూచించారు. పొరపాటున ఎవరి చేతిలోనైనా మోసపోతే మాత్రం వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు.