Hyderabad : ఈ వేళలు దాటితే హైదరాబాద్ సిటీలోకి నో ఎంట్రీ
హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. లారీలు, బస్సులు నగరంలోకి అనుమతించే వేళలను నిర్ణయించారు.;
హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. లారీలు, బస్సులు నగరంలోకి అనుమతించే వేళలను నిర్ణయించారు. భారీ లోడుతో వచ్చే లారీలు ఇకపై ఉదయం ఏడు గంటలు దాటితే హైదరాబాద్ నగరంలోకి అనుమతించారు. అలా వచ్చిన లారీలకు భారీ జరిమానా విధిస్తామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లోని 94 రూట్లలో ఈ నిబంధనలను అమలు చేయనున్నారు. నేటి నుంచే ఈ విధానం అమలు జరగనుంది.
వివిధ రాష్ట్రాల నుంచి...
అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులను ఉదయం ఎనిమిది గంటల తర్వాత నగరంలోకి అనుమతి ఉండదు. ఆర్టీసీ బస్సులు మినహా ప్రయివేటు బస్సులకు ఎలాంటి అనుమతిని ఉదయం ఎనిమిది గంటల తర్వాత ఉండదని పోలీసులు తెలిపారు. ఈ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు.