Allu Arjun : ముగిసిన అల్లు అర్జున్ విచారణ .. మూడు గంటలకు పైగా...?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోలీసు విచారణ ముగిసింది. ఆయనను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో దాదాపు మూడు గంటలకు పైగా అధికారులు విచారణ చేశారు

Update: 2024-12-24 08:32 GMT




 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోలీసు విచారణ ముగిసింది. ఆయనను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో దాదాపు మూడు గంటలకు పైగా అధికారులు విచారణ చేశారు. ఈరోజు పదకొండు గంటలకు విచారణకు రావాలని నిన్ననే పోలీసులు నోటీసులు ఇవ్వగా రాత్రంతా తన న్యాయవాదులతో చర్చించిన అల్లు అర్జున్ ఉదయం తన తండ్రి అల్లు అరవింద్ తో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అయితే ఆయనను నేరుగా చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడానికి పోలీసు బృందాలుకూడా వచ్చాయి. 11.10 నిమిషాలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలోకి వెళ్లిన అల్లు అర్జున్ ను ఏసీపీతో పాటు ఇతర అధికారులు ఆయనను విచారించారు.

విచారణలో.....
సంథ్యా థియేటర్ లో ఆరోజు జరిగిన ఘటన గురించి ప్రశ్నలు అడిగారు. రేవతి చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసిందని కూడా అల్లు అర్జున్ ను ప్రశ్నించారు. థియేటర్ కు వచ్చే ముందు పోలీసులకు సమాచారం ఇచ్చారా? థియేటర్ యాజమాన్యానికి మీరు వస్తున్నట్లు తెలిపారా? అని కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. మహిళ తొక్కిసలాటలో చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా థియేటర్ లో ఎఎందుకు ఉన్నారని ప్రశ్నించినట్లు సమాచారం. మరోసారి పిలిస్తే విచారణకు రావాల్సి ఉంటుందని కూడా అల్లు అర్జున్ కు ఈ సందర్భంగా పోలీసు అధికారులు తెలిపినట్లు తెలిసింది. అయితే అల్లు అర్జున్ స్టేట్ మెంట్ ను కూడా రికార్డు చేశారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

Full View

Tags:    

Similar News