అసదుద్దీన్ ఒవైసీకి కోర్టు నోటీసులు
హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీకి ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలీ కోర్టు నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీకి ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలీ కోర్టు నోటీసులు జారీ చేసింది. లోక్‌సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం సందర్భంగా జై పాలస్తీనా అని నినదించడాన్ని తప్పుబడుతూ న్యాయవాది వీరేంద్ర గుప్తా కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయని తెలిసింది. ఈ కేసులో జనవరి 7న తమ ముందు హాజరు కావాలని ఒవైసీని కోర్టు ఆదేశించింది.
ప్రమాణస్వీకారం సందర్భంగా...
చట్టసభలో జై పాలస్తీనా అని నినదించి రాజ్యాంగ, న్యాయ సూత్రాలను అసదుద్దీన్ ఒవైసీ ఉల్లంఘించారని పిటిషనర్ ఆరోపించారు. దీనిపై యూపీలోని బరేలీ న్యాయస్థానంలో దాఖలైన పిటీషన్ ను పరిశీలించిన న్యాయమూర్తి ఒవైసీకి నోటీసులు జారీ చేయాలని సూచించారు. ఈ మేరకు ఎంపీ ఒవైసీకి నోటీసులు జారీ చేశారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now