మోహన్ బాబుకు నేడు నోటీసులు

సినీనటుడు మోహన్ బాబు కు నేడు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు

Update: 2024-12-24 04:07 GMT

సినీనటుడు మోహన్ బాబు కు నేడు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. హైకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియనుండటంతో మోహన్ బాబుకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. జల్పల్లిలోని తన ఇంట్లో మీడియాపై దాడి కేసులో మోహన్ బాబుపై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదయిన నేపథ్యంలో ఆయనకు ముందస్తు బెయిల్ కూడా హైకోర్టు ఇవ్వలేదు.


విచారణకు పిలిచి...

దీంతో మోహన్ బాబును పిలిచి విచారించేందుకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. ఈరోజుతో గడువు ముగియనుండటంతో పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టనున్నారు. అయితే మంచు మోహన్ బాబు ఇంట్లో ఇంకా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న కూడా మంచు మనోజ్ మంచు విష్ణపై పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ విచారణ కూడా నేడు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.



Tags:    

Similar News