రాజ్ పాకాలకు పోలీసులు నోటీసుల జారీ

జన్వాడ్ ఫాం హౌస్ పార్టీ కేసులో రాజ్ పాకాలకు పోలీసులకు నోటీసులు ఇచ్చారు

Update: 2024-10-28 06:50 GMT

 raj pakala case

జన్వాడ్ ఫాం హౌస్ పార్టీ కేసులో రాజ్ పాకాలకు మోకిలా పోలీసులకు నోటీసులు ఇచ్చారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో పోలీసులు ఇంటికి నోటీసులు అందించారు. తమ విచారణకు రావాలని, లేకుంటే ఎక్కడున్నా అరెస్ట్ చేస్తామని రాజ్ పాకాలకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. జువ్వాడ పార్టీ కేసులో విచారణ చేయాలని కోరారు. విచారణకు హాజరు కాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అడ్రస్ తో పాటు కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని, విచారణకు సహకరించాలని కోరారు. BNSS యాక్ట్ (35) సెక్షన్ ప్రకారం నోటీసులు ఇచ్చారు.

హైకోర్టుకు రాజ్ పాకాల...
నిన్నటి నుంచి రాజ్ పాకాల పరారీలో ఉన్నారు. ఆయన ఇంటివద్ద కూడా కనిపించడం లేదు. దీంతో పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేశారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని రాజ్ పాకాల పిటీషన్ లో కోరారు. హైకోర్టులో రాజ్ పాకాల పిటీషన్ పై విచారణ ఎప్పుడు జరుగుతుందన్నది మాత్రం తెలియరాలేదు. మరికాసేపట్లో దీనికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News