హైదరాబాద్‌లో ఐటీ శాఖ దాడులు
కింగ్స్ ప్యాలెస్ యజమాని షాన్‌వాజ్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు;
కింగ్స్ ప్యాలెస్ యజమాని షాన్‌వాజ్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి పెద్దయెత్తున ఆదాయపు పన్ను కట్టకుండా తప్పించుకున్నారన్న సమాచారంతో ఈ సోదాలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
షాన్‌వాజ్ ఇంట్లో సోదాలు...
గతంలోనూ ఐటీ శాఖ అధికారులు షాన్‌వాజ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ సమమయంలో ఆయన దుబాయ్ కు వెళ్లిపోయారు. షాన్‌వాజ్ ను దుబాయ్ నుంచి తీసుకు వచ్చి మరీ సోదాలు చేస్తున్నారు. మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.