ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నం కేసులో నిందితుడు అతడే
ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.;

ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు మహేష్‌పై పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు.అనుమానితుడి ఫొటోను బాధితురాలికి చూపించారు. తనపై అత్యాచార యత్నం చేసింది ఫొటోలోని వ్యక్తేనన్న బాధితురాలు పోలీసులకు తెలియజేయడంతో మహేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఫొటో చూపించడంతో...
మూడు రోజుల క్రితం ఎంఎంటీఎస్ రైలులో యువతిపై ఒక యువకుడు అత్యాచార యత్నం చేయబోగా ఆమె రైలులో నుంచి దూకిన ఘటన కేసులో పురోగతిని పోలీసులు సాధించారు. అయితే నిందితుడిగా భావిస్తునన మహేష్ ను ఏడాది క్రితమే అతని భార్య వదిలేసిందని, తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో ఒంటరిగా ఉన్న మహేష్‌గంజాయికి బానిసయ్యాడని పోలీసులు తెలిపార. ఇతనపై గతంలోనూ అనేక నేరాలు నమోదయ్యాయయని పోలీసులు చెప్పారు.