పూజారి సాయికృష్ణకు జీవిత ఖైదు
సరూర్ నగర్ లో అప్సర హత్య కేసులో పూజారి సాయికృష్ణకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది;

సరూర్ నగర్ లో అప్సర హత్య కేసులో పూజారి సాయికృష్ణకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు చెప్పింది. అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సాయికృష్ణ ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. 2023లో ఈ హత్య జరిగింది. జీవితఖైదుతో పాటు సాక్ష్యాధారాలు మాయం చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో ఈ శిక్ష విధించారు.
సరూర్ నగరలో ఉన్న...
సరూర్ నగర్ లో ఉన్న ఒక దేవాలయంలో అప్సర మృతదేహాన్ని పాతి పెట్టాడు. కారులో తీసుకెళ్లి అప్సరను హత్యచేసిన సాయికృష్ణ సెప్టిక్ ట్యాంక్ లో పూడ్చిపెట్టాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇరువర్గాల వాదనలను విన్న తర్వాత రాంగారెడ్డి జిల్లా కోర్టు యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.