శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు;

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. బెంగళూరు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం రాకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో 150 మంది ప్రయాణికుల పడిగాపులు తాము ప్రయాణించాల్సిన విమానం రాకపోవడంతో ఎదురు చూడాల్సి వచ్చింది.
విమానం ఆలస్యం కావడంతో...
తమ ప్రయాణంలో ఆలస్యం జరగడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఎయిర్ పోర్ట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. శ్రీనగర్ నుంచి ఫ్లైట్ రాకుండా బోర్డింగ్ ఎందుకు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమానం ఆలస్యమయితే కనీసం ప్రయాణికులకులకు సమాచారం తెలియకుండా ఉంచినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు.