Telangana : బెట్టింగ్ యాప్స్ కేసులో యాంకర్ శ్యామల హాజరు

బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు విచారణకు యాంకర్ శ్యామల హాజరయ్యారు;

Update: 2025-03-24 05:36 GMT
police,  betting apps, anchor shyamala,  panjagutta police station
  • whatsapp icon

బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు విచారణకు యాంకర్ శ్యామల హాజరయ్యారు. న్యాయవాదిలో కలిసి విచారణకు శ్యామల హాజరయ్యారు. ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ కేసులో ఐదుగురిని విచారించిన పోలీసులు మొత్తం పదకొండు మందికి నోటీసులు జారీ చేశారు.

ఇప్పటికే కొందరిని విచారించి...
ఇప్పటికే టేస్టీ తేజ, కానిస్టేబుల్‌ కిరణ్‌, విష్ణుప్రియ, రీతూచౌదరిని పంజాగుట్ట పోలీసులు విచారించారు. వారిలో కొందరి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్నవారికి మరోసారి నోటీసులు ఇవ్వాలని పంజాగుట్ట పోలీసులు నిర్ణయించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి కారణంతో పాటు ఎంత డబ్బు సంపాదించారన్న దానిపై కూడా విచారణ చేస్తున్నారు. మరోవైపు నేడు ఇదే కేసులో నోటీసులు అందుకున్న సన్నీయాదవ్‌ ముందస్తు బెయిల్‌పై విచారణ జరగనుంది.


Tags:    

Similar News