నేటి నుంచి ఖైరతాబాద్ గణేశుడికి పూజలు
ఖైరతాబాద్ గణేశుడు నేటి నుంచి పూజలు అందుకోనున్నారు. ఈరోజు తొలి పూజను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయనున్నారు;
ఖైరతాబాద్ గణేశుడు నేటి నుంచి పూజలు అందుకోనున్నారు. ఈరోజు తొలి పూజను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయనున్నారు. ఖైరతాబాద్ గణేశుడి విగ్రహాన్ని ఈసారి కూడా మట్టితో తయారు చేశారు. నెలల పాటు శ్రమించి దానిని తయారు చేశారు. ఈరోజు నుంచి ఖైరతాబాద్ గణేశుడి పూజలు ప్రారంభమవుతాయి.
లక్షలాది మంది...
ప్రతి ఏటా ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు వస్తుంటారు. లక్షల సంఖ్యలో ప్రజలు వచ్చి పోతుంటారు. అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు. మండపానికి దగ్గరగా వీఐపీలను మాత్రమే రానివ్వనున్నారు. ఖైరతాబాద్ గణేశుడిని చూసేందుకు నేడు, రేపు భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చే అవకాశముంది.