Hyderabad : మూతపడిన ‘టానిక్’ లిక్కర్ మార్ట్‌

హైదరాబాద్ లో పేరు మోసిన లిక్కర్ మార్ట్ టానిక్ ను అధికారులు మూసివేశారు. ఇది హైలెవెల్ లిక్కర్ మార్ట్

Update: 2024-09-02 07:07 GMT

హైదరాబాద్ లో పేరు మోసిన లిక్కర్ మార్ట్ టానిక్ ను అధికారులు మూసివేశారు. ఇది హైలెవెల్ లిక్కర్ మార్ట్. ఇక్కడ అన్ని రకాల బ్రాండ్లు మద్యం దొరుకుతుంది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లో ఈ లిక్కర్ మార్ట్ ఉంది. మద్యం మార్ట్‌ ‘టానిక్‌’ లైసెన్స్‌ గడువు ముగియడంతో రెండు రోజుల క్రితం ఎక్సైజ్‌ శాఖ మూసివేసింది. 2017లో అనిత్ రెడ్డి ఈ లగ్జరీ లిక్కర్ బోటిక్‌ ను స్థాపించారు. గతంలో ఎలైట్ మద్యం దుకాణం లైసెన్స్ మంజూరు ఉంది, దీని గడువు ఆగస్టు 31తో ముగిసింది. లైసెన్స్ పునరుద్ధరణ కోసం మేనేజ్‌మెంట్ దరఖాస్తును ఎక్సైజ్ శాఖ తిరస్కరించింది.

లైసెన్స్ గడువు...
నిబంధనల ప్రకారం, బిడ్డింగ్‌లో రెండేళ్ల కాలానికి లైసెన్స్ మంజూరు చేస్తామని, అయితే ఈ లిక్కర్ మార్ట్ ఏర్పాటుకు ఐదేళ్లపాటు రెండుసార్లు లైసెన్సు ఇచ్చినట్లు మొదట్లో ఆరోపణలు వచ్చాయని, లైసెన్స్ గడువు ముగియడం, పునరుద్ధరణ దరఖాస్తును తిరస్కరించడంతో మూసివేశామని అధికారి ఒకరు తెలిపారు. గతంలో కూడా టానిక్ లిక్కర్ మార్ట్ పై దాడులు జరిగాయని, నాడు వాణిజ్య పన్నుల శాఖతో పాటు ఎక్సైజ్ శాఖ కూడా దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసింది.
స్టాక్ విలువ 1.5 కోట్లు...
ఈ లిక్కర్ మార్ట్ లో మిగిలిన స్టాక్ విలువ 1.5 కోట్ల రూాపాయలుగా ఉంటుంది. అయితే మూసివేసిన టానిక్ లిక్కర్ మార్ట్ లో ఉన్న స్టాక్ ను వేరొక మద్యం అవుట్ లిక్కర్ కు మళ్లించనున్నారు. ఇందులో అనిత్ రాజ్ లక్ష్మణ్ రెడ్డి, శిల్ప అనిత్ రెడ్డి భాగస్వామ్యులుగా ఉన్నారు. లిక్కర్ మార్ట్ మూసి వేయడంతో ఈ షాపు కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారని దాని యజమానులు చెబుతున్నారు.


Tags:    

Similar News